Ravi kishan: మరో వివాదంలో చిక్కుకున్న రేసుగుర్రం విలన్..!

Ravi kishan..తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు రవి కిషన్.. గతంలో ఎన్నో చిత్రాలలో నటించిన రవి కిషన్ రేసుగుర్రం చిత్రంలో శివారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించారు..ఈ క్రేజ్ తోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు రవి కిషన్.. ఈయన నటుడు గానే కాకుండా బీజేపీ ఎంపీగా కూడా బాగానే పాపులారిటీ అందుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రవి కిషన్ ఒక వివాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.

Ravi kishan:Ravi kishan caught in another controversy..!
Ravi kishan:Ravi kishan caught in another controversy..!

వివాదంలో చిక్కుకున్న రవి కిషన్..

అసలు విషయంలోకి వెళ్తే అపర్ణ ఠాకూర్ అనే ఒక మహిళ.. తాను రవికిషన్ భార్యను అంటూ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు తన కూతుర్ని సామాజికపరంగా రవికిషన్ అంగీకరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. లక్నో లో అపర్ణ ఠాకూర్ తన కూతురు షెనోవాతో కలిసి మీడియాతో మాట్లాడారు 1996లో తనకు రవికిషన్ తో పెళ్లి జరిగిందని.. ఆ తర్వాత తమకు కూతురు పుట్టిందని ఆమె తెలిపారు.. రవి కిషన్ తన కూతురితో మాట్లాడుతున్నప్పటికీ బహిరంగంగా అటు సామాజికంగా షెనోవా ను తన కూతురిగా అంగీకరించడం లేదని అపర్ణ ఠాకూర్ ఆరోపిస్తున్నారు. రవి కిషన్ కు షెనోవా కూతురుగా ఉండే హక్కు ఉందని ఆమె చెబుతున్నారు. అలాగే తన కూతురితో కలిసి రవి కిషన్ ఉన్నప్పటి ఫోటోలు కూడా ఆమె చూపించారు. ఒకవేళ ఆయన తన కూతుర్ని కూతురిగా అంగీకరించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని కూడా స్పష్టం చేశారు అపర్ణ ఠాకూర్..

రవి కిషన్ పై షెనోవా కామెంట్స్..

షెనోవా మాట్లాడుతూ.. నాకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు రవికిషన్ మా నాన్న అని తెలిసింది.. అంతకుముందు ఆయనను నేను అంకుల్ అని మాత్రమే పిలిచేదాన్ని.. నా పుట్టిన రోజు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆయన మా ఇంటికి వస్తూ ఉండేవారు.. నేను ఆయన కుటుంబాన్ని కూడా కలిశాను. ఒక తండ్రిగా ఆయన నాకు అండగా ఉండలేదు.. కనీసం నన్ను కూతురుగా అంగీకరించాలని ఇప్పుడు కోరుతున్నాను.. అందుకే మేము కోర్టులో కేసు వేయాలని నిర్ణయించుకున్నాము అంటూ ఆమె తెలిపింది..

- Advertisement -

రవి కిషన్ కెరియర్..

ఇదిలా ఉండగా నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన రవికిషన్ ..ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి చేరారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ గా పనిచేస్తున్నారు. ఎక్కువగా భోజ్ పురి, హిందీ అలాగే తెలుగు సినిమాలలో నటించారు.. ప్రస్తుతం తన భార్య ప్రీతి కిషన్ తో ఉంటున్నారు రవి.. వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంది. ఇక ఇప్పుడు అపర్ణ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈయన మొదటి భార్య ఈయనకు విడాకులు ఇస్తుందేమో అని కూడా ఒక కొత్త వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు నిజం తెలియాలంటే రవి కిషన్ స్పందించాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం అపర్ణ ఠాకూర్ తన కూతురితో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు