Vishal34: సమ్మర్ బరిలో విశాల్ ‘రత్నం’..!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఇయర్ మార్క్ ఆంటోనీ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోగా, ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. అయితే వాటిలో తమిళ్ స్టార్ డైరెక్టర్ హరి సినిమా కూడా ఉంది. ఆరు నెలల కిందటే మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ మార్క్ ఆంటోనీ సినిమా కోసం షూట్ వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయగా తాజాగా సినిమా గురించి ఒక్కో అప్డేట్ వస్తుంది.

విశాల్ కి ఇది 34 వ సినిమా కాగా, విశాల్ హరి కాంబో లో వస్తున్న మూడో సినిమా ఇది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, ఇంకా టైటిల్ ని రివీల్ చేస్తూ చిన్న టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ టీజర్ డైరెక్టర్ హరి రెగ్యులర్ సినిమా ఫార్మాట్ లోనే ఫుల్ మాస్ స్టఫ్ తో ఉన్నా, టీజర్ లో విశాల్ ని చూపించిన తీరు, ఆ టైం లో వచ్చిన dsp బీజీఎమ్ అదిరిపోయాయి.

ఇక విశాల్ హరి కాంబో లో వస్తున్న ఈ సినిమాకి “రత్నం” అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఇక టీజర్ చివర్లో రత్నం సినిమాని 2024 సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసారు మేకర్స్. అయితే సమ్మర్ అంటే ఏప్రిల్, మే రెండు నెలల్లో ఎదో ఒక వారం రావచ్చు. ఇక సమ్మర్ లో ఇప్పటికే బడా సినిమాలు లైన్లో ఉన్నాయి. దేవర, గేమ్ ఛేంజర్ తో పాటు
రాజా డీలక్స్, ఇంకా పలు మీడియం రేంజ్ సినిమాలు కూడా సమ్మర్ లో వస్తున్నాయి.

- Advertisement -

ఇక విశాల్ రత్నం సినిమా లో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడని కొందరు అంటుండగా, అఫీషయల్ గా మేకర్స్ మాత్రం ప్రకటించలేదు. అయితే రత్నం సినిమా హరి గత సినిమాల్లా పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కుతోందని రిలీజ్ అయిన పోస్టర్స్ తోనే క్లారిటీ రాగా, టీజర్ తో కన్ఫర్మేషన్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి సంగీతం అందిస్తుండగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు