Vishal34: ఆ రోజున ఫస్ట్ షాట్ కొడుతున్నాడు..!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మంచి ఊపు మీదున్నాడు. రీసెంట్ గా మార్క్ ఆంటోనీ తో సూపర్ హిట్ కొట్టిన విశాల్, ఇప్పుడు తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ హరితో సినిమా చేస్తున్నాడు. ఇంతకు ముందే వీరి కాంబినేషన్ లో భరణి, పూజ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా రాబోతుంది. విశాల్ 34వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

రెండు నెలల కిందే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభనైనా కూడా మార్క్ ఆంటోనీ సినిమా వల్ల ఈ సినిమాని కొన్ని రోజులు ఆపాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు కొన్ని రోజులుగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోగా, తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు విశాల్. హరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విశాల్ సొంత బ్యానర్ అయిన “విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ” బ్యానర్లోనే తెరకెక్కుతుండగా, ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టు కాసేపటి కిందటే విశాల్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసాడు.

ఒక స్టెత స్కోప్, తో పాటు గన్ ఉన్న పోస్టర్ ని అనౌన్స్ మెంట్ గా రిలీజ్ చేయగా, దాన్ని బట్టి ఈ సినిమాలో విశాల్ ఒక డాక్టర్ గా, ఇంకా పోలీస్ గా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడని అనిపిస్తుంది. ట్విట్టర్ లో ఫస్ట్ షాట్ ఒకటో తారీఖున కొట్టబోతున్నామని చెప్పి మరి అనౌన్స్ చేసారు. ఒక వేళ ఇది ద్విపాత్రాభినయం కూడా కావచ్చు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ కలగడం ఖాయం అని చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు