Vishal34: హ్యాట్రిక్ మాస్ కాంబో కి రాక్ స్టార్ మ్యూజిక్

తమిళ్ మాస్ డైరెక్టర్ హరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో బోయపాటి లాగా, తమిళ్ లో ఊర మాస్ బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డైరెక్టర్ హరి. తమిళ్ లో ఈయన తీసిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాయి. సూర్య సింగం సీరీస్ ఈయన తెరకెక్కించినవే. ఇక హరి ఇప్పుడు తమిళ్ స్టార్ విశాల్ తో తన కొత్త సినిమా తీస్తున్నాడు. ఇంతకు ముందే వీరి కాంబినేషన్ లో భరణి, పూజ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు వీరి కాంబో లో హ్యాట్రిక్ సినిమా రాబోతుంది.

విశాల్ 34వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్టు చిత్ర యూనిట్ ఈ రోజు కన్ఫర్మ్ చేసింది. ఇంతకు ముందు డైరెక్టర్ హరి తీసిన సింగం సిరీస్ కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు డిఎస్పీ. ఇప్పుడు మళ్ళీ విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా హిట్ కావడం అటు విశాల్ కి ఇటు డైరెక్టర్ హరికి కి చాలా అవసరం. వీరి నుండి గత కొన్నాళ్లుగా సరైన హిట్ సినిమా రాలేదు.

ఇక హరి డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా విశాల్ సొంత బ్యానర్ అయిన “విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ” బ్యానర్లోనే తెరకెక్కనుంది. ఇంకా ఇతర నటీనటులు ఫిక్స్ కాలేదు. ఇక విశాల్ నటిస్తున్న “మార్క్ ఆంటోనీ” సినిమా విడుదలైన తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు