Trivikram Sreenivas: ఈ దర్శకులు కొత్త వారితో చేయరా?

టాలీవుడ్ లో ఏదైనా కాంబోలో సినిమా వస్తుందంటే దానిపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ అదే కాంబో మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. రిలీజ్ అయ్యాక కూడా కంటెంట్ బాగుంటే తప్ప ఆదరించరు. అయితే టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు ప్రముఖ దర్శకులు మాత్రం రిపీట్ స్ట్రాటజీ ని విపరీతంగా ఫాలో అవుతున్నారు. వారే త్రివిక్రమ్ శ్రీనివాస్, గోపీచంద్ మలినేని.

ఈ డైరెక్టర్లిద్దరూ కొత్త హీరోలతో కాకుండా తమతో ఇంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళతోనే మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా వీరు అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ అలానే ఉన్నాయి మరి.

ముందుగా గోపీచంద్ గురించి చెప్పుకుంటే ఈ డైరెక్టర్ మాస్ రాజా రవితేజతో నాలుగోసారి సినిమా తీయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇంతకు ముందు వీరి కాంబో లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. ఇప్పుడు వీరి కాంబో లో నాలుగో సినిమాగా పవర్ ఫుల్ మాస్ సినిమా వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

- Advertisement -

అయితే గోపీచంద్ రవితేజతో కాకుండా తీసిన మిగతా నాలుగు సినిమాలు నలుగురు హీరోలతో చేయగా, అవి యావరేజ్ హిట్లయ్యాయి కానీ, బ్లాక్ బస్టర్స్ కాలేదు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ రిపీట్ స్ట్రాటజీ ఇంకా బాగా ఫాలో అవుతాడు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ సినిమాలు తీయగా, ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న గుంటూరు కారం కూడా హ్యాట్రిక్ సినిమానే. దీని తర్వాత ప్రకటించిన కొత్త సినిమా కూడా కొత్త హీరోతో కాకుండా రిపీట్ చేస్తున్న హీరో కావడం విశేషం. అదే అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా. వీరి కాంబో లో వచ్చిన జులాయి, అలవైకుంఠపురంబులో బ్లాక్ బస్టర్లు కాగా, సన్ అఫ్ సత్యమూర్తి యావరేజ్ అయింది. ఇప్పుడు నాలుగో సినిమా వస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా అనౌన్స్ మెంట్ కాగా, వీళ్ళు చేస్తున్న పుష్ప2, గుంటూరు కారం రిలీజ్ అయ్యాకే స్టార్ట్ అవుతుంది.

అయితే చాలా మంది ఆడియన్స్ కొత్త కాంబో చేస్తేనే ఎక్కువ ఎక్సయిట్ మెంట్ తో ఎదురు చూస్తారు. ఇలా రిపీట్ కాంబో లో వస్తే ముందు బాగానే చూసినా, ఆ తర్వాత రొటీన్ అనిపిస్తుంది. మరి ఇప్పుడు చేయబోయే సినిమాలు కాకుండా ఆ తర్వాతైనా కొత్త హీరోలతో వర్క్ చేస్తారేమో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు