Extra OrdinaryMan Teaser : ‘ఆర్డినరీ మ్యాన్’ ‘ఎక్సట్రార్డినరీ’ స్టఫ్ తో వస్తున్నాడు..!

టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల్లో ఒకరైన నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఈ హీరో ఇప్పుడు అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు తడబడి ప్లాపులు అందుకున్నాడు. కానీ పెర్ఫార్మన్స్ విషయంలో మాత్రం ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేయడు. లాస్ట్ ఇయర్ ‘మాచర్ల నియోజకవర్గం’ తో ప్లాప్ అందుకున్న ఈ హీరో ఈ ఇయర్ పక్కా ప్లానింగ్ తో ఒక ఆర్డినరీ మ్యాన్ గా ఎక్సట్రార్డినరీ స్టఫ్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి వస్తున్నాడు.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ చేస్తున్న ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా, తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.

టీజర్ లోనే నితిన్ సినిమాల్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వేషం వేసే యువకుడిగా చూపించగా, లేటెస్ట్ గా ట్రైలర్ లో కూడా అది కంటిన్యూ చేస్తూనే, ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ట్రైలర్ లో చూపించిన దాన్ని బట్టి నార్మల్ గానే చాలా సినిమాల్లో మిడిల్ క్లాస్ హీరోకు ఉండే కష్టాలు కొంచెం ఫన్ యాడ్ చేస్తూ చూపించగా, ఆ తర్వాత ఓ హీరొయిన్, ఓ విలన్, మోటివేషన్ కు స్పెషల్ రోల్ లో మరో హీరో అన్నట్టు చూపించి ఎండ్ చేసారు.

- Advertisement -

అయితే ఈ నార్మల్ స్టోరీనే వక్కంతం వంశి తన జోనర్లో ఎక్సట్రార్డినరీ ఫన్ ఇంకా ఎంటెర్టైన్మెంట్ తో చూపిస్తున్నాడని తెలుస్తుంది. రాజశేఖర్ స్పెషల్ అప్పీరెన్స్ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక దానికి హ్యారిస్ జైరాజ్ మ్యూజిక్ కూడా ప్లస్ అవనుంది. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న రిలీజ్ అవుతుండగా, దానికి ఒకరోజు ముందే నాని ‘హాయ్ నాన్న’ కూడా రిలీజ్ అవుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు