సినిమా ఇండస్ట్రీలో రోజుకో పెళ్లి వార్త వినిపిస్తోంది. ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు గోవా బ్యూటీ ఇలియానా తన ప్రియుడిని పరిచయం చేసింది. పెళ్లి కాకుండానే బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. ఆమె మరెవరో కాదు. దండు పాళ్యం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజా గాంధీ.
నిజానికి కన్నడ నటి అయిన పూజా గాంధీ దండుపాళ్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యింది. 2002లోనే ఈ ముద్దుగుమ్మ సినిమాలలో అడుగుపెట్టింది. దుష్మణి అనే హిందీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తరవాత కన్నడలో మొదటి సినిమా మాన్ సూన్ తోనే సూపర్ హిట్ అందుకుని అక్కడ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తరవాత సుమారు ముప్పై సినిమాల వరకు చేసి బిజీ నటిగా మారిపోయింది.
ఇక కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితం అవ్వకుండా తెలుగు, బెంగాలీ, తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకుంది. ఇక దండుపాళ్యంతో మాత్రం ఈ నటి కెరీర్ మలుపు తిరిగిపోయింది. దండుపాళ్యం సిరీస్ లు సూపర్ హిట్ గా నిలవడంతో వరుస ఆఫర్ లను అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూజా గాంధీ పెళ్లి చేసుకోబోతుంది.
అంతే కాదు మంచి క్యాష్ పార్టీతోనే అమ్మడి వివాహం జరగబోతుంది. పూజా తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన విజయ్ తోనే ఏడు అడుగులు నడవబోతుంది. పూజా తల్లి దండ్రులు బెంగాల్ కు చెందిన వారని సమాచారం. ఇక ఆమె అసలు పేరు కూడా సంజన అని తెలుస్తోంది. కానీ సినిమాల్లోకి వచ్చిన తరవాత పేరును పూజా గాంధీగా మార్చుకున్నట్టు తెలుస్తోంది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify