Kalyan Krishna : డాక్టర్ ఉసురు పోసుకున్న నాగ్ డైరెక్టర్… ల్యాండ్ గొడవలో సూసైడ్

టాలీవుడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా నాగార్జునకు “సోగ్గాడే చిన్ని నాయన”, “బంగార్రాజు” వంటి హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ అంటే అక్కినేని అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి హిట్స్ తో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఈయన వల్ల ఓ డాక్టర్ ప్రాణాలు తీసుకున్నాడని, ఈ డైరెక్టర్ ఓ మనిషి ఉసురు పోసుకున్నాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు సోదరుడు, డైరెక్టర్ అయిన కళ్యాణ్ కాకినాడలో ఓ వైద్యుడు వద్ద భూమి పత్రాలు లాక్కున్నాడట. దీంతో ఆ డాక్టర్ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడట. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్లు కళ్యాణ్ కృష్ణపై మండిపడుతున్నారు. న్యూస్ పెద్దదవ్వకుండా మీడియాను హ్యాండిల్ చేస్తారని, ఒకవేళ ఎలాగోలా ఈ న్యూస్ బయటకు వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా స్ట్రెస్ వల్ల, పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకున్నాడని ముద్ర వేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇలా ల్యాండ్ పోతే న్యాయపరంగా సాధించాలి.

ఒకవేళ ఓడిపోతే ఇంకోటి సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ల కుటుంబానికి ఇది తీరని లోటు అవుతుంది. ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడం అంటే సమాజంగా మనం ఓడిపోయినట్టేనంటూ బాధపడుతున్నారు.

- Advertisement -

అయితే ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం ప్రకారం… మృతుడి తల్లి శేషారత్నం మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు పురుగుల మందు తాగి ఆదివారం తెల్లవారుజామున చనిపోయాడని, అక్కడ స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులకు ఈ ఆత్మహత్యతో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పానని వెల్లడించారు. ఇక కన్నబాబుకు, కళ్యాణ్ కు తన కుమారుడి ఆత్మహత్యలో ఎలాంటి ప్రమేయం లేదని, తన కొడుకు చనిపోవడంతో పొలం మేటర్ లో ఏదో గొడవ ఉండి ఉంటుందని వాళ్ళు, వీళ్ళు అనడం వల్ల డిప్రెషన్ తో అలా మాట్లాడాను అని అన్నారావిడ.

పొలం విషయంలో డిప్రెస్ అయ్యి, ఆర్థిక కారణాలతో సెన్సిటివ్ గా ఉండడం వల్లే పురుగుల మందు తాగాడని కానీ ఈ వివాదాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని, దయచేసి ఈ సంఘటనను రాజకీయం చేయొద్దని శేషారత్నం వేడుకున్నట్టుగా అందులో ఉంది. మరి అసలు నిజం ఏంటనేది డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణే చెప్పాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు