Love Life Tips : తెలియని వ్యక్తితో డేటింగ్ ? ఈ విషయాల్లో జర భద్రం

పూర్వకాలంలో వివాహం చేయాలంటే పెద్దల జోక్యం ఎక్కువగా ఉండేది. అబ్బాయి ఫ్యామిలీ వాళ్లకు అమ్మాయి నచ్చితే చాలు ఓకే అనుకుని చేసుకునేవారు. అప్పట్లో పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయి చూసుకోవడం, కలుసుకోవడం లాంటివి కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. యూత్ అంతా తమ కోరిక మేరకే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా ప్రేమ వివాహాలే ఉంటున్నాయి. పెళ్లికి ముందే ఒకరిని ఒకరు చూసుకోవడం, మాట్లాడుకోవడం, కొంతకాలం కలిసి జర్నీ చేయడం చేస్తున్నారు ఆ తర్వాత ఓకే అయితే పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇక ఇటీవల కాలంలో ఒకడుగు ముందుకేసి డేటింగ్ పేరుతో తిరుగుతున్నారు. అందుకే డేటింగ్ యాప్ లు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా ద్వారా లేదంటే డేటింగ్ యాప్ ల ద్వారా కలుసుకుని, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని ఇద్దరి అభిరుచులు కలిస్తే పెళ్లి చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా డేటింగ్ ప్లాన్స్ లో ఉన్నా, లేదంటే తెలియని వ్యక్తితో డేటింగ్ కు వెళ్తున్నా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడతాయి. తెలియని వ్యక్తితో డేటింగ్ కు వెళ్లేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒంటరిగా కలవడం వంటి ఆలోచన ఉంటే మానుకోండి. తెలియని వ్యక్తితో డేటింగ్ కు వెళ్తున్నప్పుడు ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలా గనుక మీరు వెళ్లాల్సి వస్తే మీ ఫ్రెండ్స్ లో ఒకరిని మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పండి. డేటింగ్ కు వెళ్లాక అక్కడ ఏదైనా తప్పు జరుగుతున్నట్టుగా అనిపిస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది.

మొబైల్ ను తప్పకుండా అలర్ట్ మోడ్ లో ఉంచండి. తెలియని వ్యక్తితో డేటింగ్ కు వెళ్ళినప్పుడు లేదా ప్రమాదకర సమయంలో మొబైల్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఫోను అస్సలు స్విచ్ ఆఫ్ చేయకూడదు. బయటకు వెళ్లేముందే మొబైల్ ఫోను పూర్తిగా చార్జింగ్ చేసి పెట్టుకోండి. మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కి లేదా పోలీసుల నెంబర్ ని డయల్ ప్యాడ్ పై ఉంచుకోండి. పరిస్థితి అనుమానాస్పదంగా ఉన్నా, లేదా ప్రమాదం అనిపించినా, ఏదైనా తప్పుగా అనిపిస్తే వెంటనే ఫోన్ చేసేయండి. అలాగే మీ సన్నిహితులకు లైవ్ లొకేషన్ లో షేర్ చేస్తూ ఉండండి.

- Advertisement -

నిర్జన ప్రదేశాల్లో కలవకండి. తెలియని వ్యక్తితో డేటింగ్ చేస్తూ అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా తెలియని, లేదా ఎవరూ లేని ప్రదేశంలో కలవకూడదని గుర్తుపెట్టుకోండి. అలాంటి మీటింగ్స్ ఎప్పుడూ జనాలు ఉండే బహిరంగ ప్రదేశాల్లోనే పెట్టుకోండి. అలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు.

మీరు ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? ఎక్కడ కలవడానికి వెళ్తున్నారు? వంటి విషయాలను మీ సన్నిహితులతో షేర్ చేసుకోండి. మీరు డేటింగ్ కు వెళ్తున్న వ్యక్తికి సంబంధించి మీకు తెలిసిన పూర్తి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ లో ఎవరికో ఒకరికి చెప్పండి. ఆలా చేస్తేనే మీరు ఒకవేళ ఏదైనా సమస్యలో చిక్కుకుంటే సకాలంలో సహాయం అందుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు