Jai hanuman: జై హనుమాన్ నుంచి శ్రీరామనవమి స్పెషల్ అప్డేట్.. పోస్ట్ వైరల్..!!

Jai hanuman.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం హనుమాన్.. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. యంగ్ హీరో తేజ సజ్జ ఈ చిత్రంలో హీరోగా నటించారు.. హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించగా.. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఎటువంటి హడావిడి లేకుండా విడుదలైన హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి అందరి చేత శభాష్ అనిపించింది.

Jai hanuman..Sri Ram Navami Special Update from Jai Hanuman.. Post Viral..!!
Jai hanuman..Sri Ram Navami Special Update from Jai Hanuman.. Post Viral..!!

జై హనుమాన్..

హనుమన్ సినిమా ఎండింగ్లో ఈ సినిమా సీక్వెల్ కొనసాగుతుందంటూ డైరెక్టర్ లీడ్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అంతేకాకుండా అందుకు టైటిల్ కూడా జై హనుమాన్ అంటూ సీక్వెల్ ని కూడా ఎన్నోసార్లు ప్రకటించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. అభిమానులు సైతం ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా? అంటూ ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

జై హనుమాన్ నుంచి పోస్టర్ రిలీజ్..

జై హనుమాన్ సినిమాకి సంబంధించి అప్పుడప్పుడు పలు రకాల అప్డేట్లను అందిస్తూ.. ఖుషీ చేస్తూ ఉంటారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా తాజాగా జై హనుమాన్ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ ని తెలియజేశారు.. అసలు విషయంలోకి వెళ్తే.. రాముడు ఆంజనేయుడికి మాట ఇస్తున్నట్లుగా ఒక కొత్త పోస్టర్ ను డిజైన్ చేసి ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఆ పోస్టుని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు.

- Advertisement -

సంతోషంలో ఫ్యాన్స్..

ఈ పోస్టర్ చూసి అభిమానులు సైతం తెగ సంబరపడిపోతున్నారు. గడిచిన కొంతకాలంగా జై హనుమాన్ సీక్వెల్ వాయిదా పడుతోంది అని వార్తలు వినిపించాయి. కానీ ఈ రోజున ఈ అప్డేట్ తో ఈ విషయానికి క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు.. అలాగే ఈ పోస్టర్ తో ఒక కొటేషన్ రాసుకొస్తూ..”ఒకప్పుడు త్రేతా యుగంలో భయంకరమైన ఒక వాగ్దానం చేయబడింది అది కలియుగంలో రక్షించబడుతుంది “అంటూ చిత్ర బృందం పోస్టర్ లో ఇలా రాసుకొచ్చింది. ఈ పోస్టర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

హనుమాన్ ని మించి..

ఈసారి కూడా జై హనుమాన్ చిత్రం అదిరిపోయే విజువల్స్ తో మరింత అద్భుతంగా ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి ఇందులో ఎవరెవరు నటిస్తారో చూడాలి మరి.

మొత్తానికైతే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ అభిమానుల సైతం అంచనాలు వేస్తున్నారు. మరి ఏమేరా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు