Tollywood : శ్రీ రాముడి పాత్రలో నటించి మెప్పించిన తెలుగు హీరోలు..!

Tollywood : నేడు శ్రీ రామ నవమి.. శ్రీ రామ చంద్రుని జన్మదినాన్ని పురస్కరించుకుని చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున జరుపుకునే పండగనే శ్రీరామ నవమి గా పిలుచుకుంటారు. ఇక శ్రీ రాముడిపై సినిమాలు అంటే తెలుగు చిత్ర పరిశ్రమలోనే అద్భుతంగా తీయగలరని చాలా మంది అంటుంటారు. అలాగే తెలుగులో రాముడి పాత్రలో తెలుగు చిత్రసీమ(Tollywood) నుండే ఎక్కువ మంది నటులు నటించి మెప్పించడం జరిగింది. అలా తెలుగులో శ్రీ రాముడి పాత్రల్లో మెప్పించిన వారు ఎవరో ఒక్కసారి తెలుసుకుందాం ..

1. Y. సూర్యనారాయణ : పాదుకా పట్టాభిషేకం(1932)

తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరాముడి పాత్రను పోషించిన తొలి తెలుగు నటుడు యడవల్లి సూర్యనారాయణ. 1932లో విడుదలైన పాదుకా పట్టాభిషేకం చిత్రంలో రాముడిగా నటించారు.

2. CSR ఆంజనేయులు : పాదుకా పట్టాభిషేకం(1942)

1945లో తిరిగి అదే పేరుతో (పాదుకా పట్టాభిషేకం)తో మరో సినిమా విడుదలైంది. ఇందులో రాముడిగా CSR ఆంజనేయులు నటించారు.

- Advertisement -

అక్కినేని నాగేశ్వరరావు : శ్రీ సీతారామ జననం (1944)

లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో 1944లో విడుదలైన శ్రీ సీతా రామ జననంలో రాముడి పాత్రను పోషించారు. ఆయనకీ హీరోగా కూడా ఇదే అతని మొదటి చిత్రం. సంగీత దర్శకుడు ఘంటసాల కి కూడా ఇదే తొలి సినిమా. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో రాముడి పాత్రల్లో నటించారు.

నందమూరి తారక రామారావు :

నట సార్వభౌమ ఎన్టీ రామారావు హీరోగా సంపూర్ణ రామాయణం, లవ కుశ, రామాంజనేయ యుద్ధం, మరియు శ్రీరామ పట్టాభిషేకం వంటి ఎన్నో చిత్రాలలో రాముని పాత్రను పోషించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ అంటే తెలుగు వారికి రాముడు, కృష్ణుడు అనేవారు. ఈ పాత్రలలో ఆయన సృష్టించిన ప్రభావం అలాంటిది.

హరనాథ్:

ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో రావణుడిగా నటిస్తూ తెరకెక్కించిన సీత రామ కళ్యాణం చిత్రంలో హరనాథ్ నటించారు. 1961లో విడుదలైన సీతా రామ కళ్యాణం తో పాటు 1968లో విడుదలైన శ్రీరామ కథలో కూడా ఈయన రాముడి పాత్రను పోషించారు.

శోభన్ బాబు :

1972లో బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణంలో లెజెండరీ నటుడు శోభన్ బాబు రాముడి పాత్రను పోషించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రాముడి పాత్రలో ఎన్టీ రామారావు తర్వాత అంతటి ఖ్యాతి వచ్చింది శోభన్ బాబుకే.

కాంత రావు :

1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ చిత్రంలో, అలాగే మరికొన్ని చిత్రాల్లో కాంతారావు రాముడిగా కనిపించారు.

రవి కుమార్ :

1976లో బాపు దర్శకత్వం వహించిన సీతా కళ్యాణం చిత్రంలో రవి కుమార్ రాముడిగా కనిపించాడు.

శ్రీకాంత్ :

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం దేవుళ్లు లో శ్రీకాంత్ కొంత సమయం పాటు శ్రీరాముడిగా కనిపించారు.

సుమన్ :

సుమన్ 2006లో వచ్చిన శ్రీరామ దాసు అనే భక్తి రస చిత్రంలో రాముడి పాత్రలో నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున రామ భక్తుడిగా పాత్ర పోషించారు.

బాలకృష్ణ :

2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం చిత్రంలో నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా కనిపించారు. అంతకు ముందు కూడా కొన్ని పాత చిత్రాల్లో పాటల్లో రాముడిగా కాసేపు కనిపించారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఇక రీసెంట్ గా ప్రభాస్ అది పురుష్ చిత్రంలో రాముడిగా నటించడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు