War 2 Leak : మరో లీక్… వార్ 2 మేకర్స్ మరీ ఇంత కేర్ లెస్ గా ఉన్నారేంటి?

War 2 Leak : ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో వార్ 2 కూడా ఒకటి. ఈ మూవీలో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసింది. మొట్ట మొదటిసారి వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండంతో సినిమాపై ఇటు సౌత్ అటు నార్త్ మూవీ లవర్స్ లో అంచనాలు బాగా పెరిగిపోయాయి. అయితే ఆ క్యూరియాసిటీని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు లీకు రాయుళ్లు. ఇప్పుడిప్పుడే షూటింగ్ స్టార్ట్ అవుతున్న ఈ మూవీకి సంబంధించిన వరుస లీకులు అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.

మరో లీక్… ఇంత కేర్ లెస్ గా ఉన్నారేంటి?

తాజాగా మరోసారి సెట్స్ నుంచి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇదివరకే ఎన్టీఆర్ ముంబైలో కాలు పెట్టగానే మొదలైన లీకుల బెడద ఇంకా కంటిన్యూ అవుతుంది. దీంతో మేకర్స్ ఇంత కేర్ లెస్ గా ఎందుకు ఉన్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లీకైన ఫోటోలో హృతిక్ రోషన్ బ్లూ సూట్ లో కనిపించగా, ఎన్టీఆర్ బ్లాక్ కలర్ క్యాజువల్ టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధరించి కనిపించారు. ఈ లీకైన ఫోటోలు చూశాక ఇద్దరు హీరోలపై ఎలాంటి సన్నివేశాల షూటింగ్ జరగబోతోంది అని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు నెటిజన్లు. వీళ్లిద్దరి అవతారం చూస్తుంటే యాక్షన్ సన్నివేశాలు, లేదా స్పై సీన్స్ ను మేకర్స్ తెరకెక్కించే అవకాశం ఉంది అన్పిస్తోంది. ప్రస్తుతం ముంబైలో 10 రోజుల షెడ్యూల్ మొదలుపెట్టారు మేకర్స్. అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మీద ఒక భారీ సాంగ్ తో పాటు యాక్షన్ సన్నివేశాన్ని కూడా తీస్తున్నారని టాక్ నడుస్తోంది.

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కెరీర్ లోనే ఇదొక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇదివరకు బ్రహ్మస్త అనే పాన్ ఇండియా మూవీని రూపొందించిన ఆయన ఇలా ఒక టాలీవుడ్, మరో బాలీవుడ్ స్టార్ ను తెరపై చూపించే బిగ్గెస్ట్ ప్రయత్నం చేయడం మాత్రం ఇదే మొదటిసారి. మరి ఇలాంటి భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్ట్ స్టార్ట్ కూడా కాకుండానే ఇన్ని లీకులు రావడం ఏంటి? ఆయన అసలు ఇంత కేర్ లెస్ గా ఎందుకు ఉన్నాడని మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మేలుకొని లీకులు మరోసారి రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

- Advertisement -

లీకులు అవ్వకుండా ఉండాలంటే…

ఇదివరకు కొన్ని పాన్ ఇండియా సినిమాలకు ఇలాంటి పరిస్థితే ఎదురవ్వగా, ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న చర్యల కారణంగా లీకు రాయుళ్లకు స్టఫ్ దొరక్క సైలెంట్ అయిపోయారు. పుష్ప 2 మూవీ విషయంలో కూడా ఇలాగే వరుసగా లీకులు వచ్చాయి. ఇక రీసెంట్ గా రామాయణం మూవీ ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో అలా లీకులు బయటకు రావడం మొదలైంది. ఈ రెండు సినిమాల డైరెక్టర్స్ సుకుమార్, నితీష్ తివారి కూడా లీక్స్ విషయం సీరియస్ గా తీసుకొని సెట్స్ లో ఎవ్వరూ మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకుండా రూల్ తీసుకువచ్చారు. అప్పటినుంచి ఈ రెండు సినిమాల నుంచి ఎలాంటి లీక్ బయటకు రాలేదు. మరి ఇప్పుడు వార్ 2 మూవీ విషయంలో కూడా అయాన్ ముఖర్జీ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే బాగుంటుందని ఈ ఇద్దరు హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు