HariHara VeeraMallu: శ్రీరామనవమి స్పెషల్ అప్డేట్.. ధర్మం కోసం యుద్ధం..!

HariHara VeeraMallu.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే తన చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులను కూడా పక్కన పెట్టారు. వాటిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఎన్నో సంవత్సరాల నుంచి మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా రావాలని ఎదురు చూస్తున్న నేపథ్యంలో.. క్రిష్ – పవన్ కాంబోలో హరిహర వీరమల్లు సినిమా.. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా గత కొంతకాలంగా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలను పెంచేశారు.. కానీ ఎటువంటి అప్డేట్ లేకపోవడం.. షూటింగ్ మొదలుపెట్టి ఆపేయడం.. మూడు సంవత్సరాలైనా సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులలో ఆందోళనలు మొదలయ్యాయి.. మరి కొంతమంది ఇక ఈ సినిమా ఉండదని లైట్ తీసుకున్నారు..

Harihara VeeraMallu: Sriramanavami Special update..
Harihara VeeraMallu: Sriramanavami Special update..

శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్ అప్డేట్..

అయితే అభిమానులలో అంచనాలను పెంచుతూ.. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఉందని చిత్ర బృందం ప్రకటించింది.త్వరలోనే అప్డేట్స్ ఇస్తామని గ్రాఫిక్ వర్క్ జరుగుతుంది అని చెబుతూ ఒక ట్వీట్ కూడా చేసింది. ఇక అందుకు తగ్గట్టుగానే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమా నుంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది..

పోస్టర్ వైరల్..

శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని పవర్ఫుల్ కళ్ళతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. దీనిపై. మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో.. అని రాయడంతో ఈ పోస్టర్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ త్వరలోనే టీజర్ రానుంది అంటూ కూడా పోస్ట్ చేసారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ చూసి పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

రాజకీయంలో కొత్త వేడి..

ఇకపోతే ఈ పోస్టర్ ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోందని చెప్పాలి.. జనసేన పార్టీని కూటమిలో భాగంగా ముందుకు తీసుకెళుతున్న పవన్ కళ్యాణ్ వైసీపీని గద్దె దించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ధర్మం కోసం పోరాడుతున్నాను అంటూ కూడా ఆయన పలు సభలలో వెల్లడించారు.. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అదే విధంగా కనిపించడంతో రాజకీయంగా కలకలం సృష్టించేలా కనిపిస్తోంది.. మరో 27 రోజుల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రజలను ఎలాగైనా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అధినేతలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమా కూడా బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. అందుకే ఆయన ఇలా పోస్టర్ల రూపంలో ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొంతమంది యాంటీ ఓటర్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే అభిమానుల కోసం అప్డేట్ ఇవ్వడానికి ఈ పోస్టర్ రిలీజ్ చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఈ పోస్టర్ అయితే రెండు విధాలుగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు