Jailer movie latest update: రజనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Jailer movie latest update

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా జైలర్ నుంచి వచ్చిన అప్డేట్ తో ఆయన ఫ్యాన్స్ తో తెగ సంబర పడిపోతున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు.. సూపర్ హిట్టై, జైలర్ సినిమాపై అంచనాలను పెంచగా, ఇక ట్రైలర్ కూడా రిలీజై, రజనీ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపబోతుంది.

విలక్షణ దర్శకుడు నెల్సన్ డైరెక్షన్ లో రాబోతున్నఈ జైలర్ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, కమెడియన్ సునీల్ రమ్య కృష్ణన్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, యోగిబాబు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజైన జైలర్ ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ నెల 10న జైలర్ సినిమా గ్రాండ్ గా రిలీజవ్వబోతుంది. ఇక సినిమా రిలీజ్ తక్కువ సమయం ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ షో కేస్ పేరుతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోయితునట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక ఈ న్యూస్ తో రజనీ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు.

- Advertisement -

చాలా రోజుల తరువాత రజనీకాంత్ తన బాడీ లాంగ్వేజ్ కు, స్టార్డం కు సరిగ్గా సరిపోయే సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై రజనీ ఫ్యాన్స్ ఈ  సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మరి ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు