Akash Goparaju: సరికొత్త కాన్సెప్ట్ తో ఆకట్టుకుంటున్న సర్కారు నౌకరోడు!

Akash goparaju Sarkaru Naukari

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా గంగనమోని శేఖర్ అనే కొత్త దర్శకుడు “సర్కారు నౌకరి” అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. ఇంతకు ముందే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ ని రిలీజ్ చేసారు.

ఇక సర్కారు నౌకరి పోస్టర్ వచ్చినపుడు ఈ సినిమాలో హీరో ఒక సీరియస్ రోల్ లో ప్రభుత్వ RMP డాక్టర్ గా కనిపించినబోతున్నాడని అనుకున్నారు. కానీ టీజర్ చూసాక ఆ అంచనాలకి రివర్స్ లో ఉంది ఆ పాత్ర. కానీ అందులోనే అసలు దాగుందని తెలుస్తుంది. కథ నేపథ్యం చూసుకుంటే సమాజానికి కావాల్సిన ఒక అవసరాన్ని కామెడీ ని జోడించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో ఎక్కువ మూవీస్ వస్తాయి. సినిమా నేపథ్యం చూస్తే హిందీలో వచ్చిన ప్యాడ్ మ్యాన్ లాగా ఇందులోనూ ఒక మెసేజ్ ఇస్తున్నారని తెలిసింది.

- Advertisement -

1996 లో తెలంగాణ ప్రాంత కొల్లాపూర్ ఊరిలో జరిగే కథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో భావన హీరోయిన్ గా నటించగా, శాండిలియా పిసపతి అనే వ్యక్తి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక డైరెక్టర్ రాఘవేంద్రరావు, సింగర్ సునీత ఇంకా చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే సర్కారు నౌకరి సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో క్లారిటీ ఇవ్వలేదు. బహుశా సెప్టెంబర్ మొదటి వారంలో లేదా చివరి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు