Sarkaru Naukari: రాఘవేంద్రుడి నిర్మాణంలో సరికొత్త కాన్సెప్ట్ సినిమా

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని రకాల సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన నాలుగు దశాబ్దాల పాటు తన సినిమాలతో ఆడియన్స్ ని అలరించారు. అయితే ఈయన దర్శకుడిగానే కాకుండా నిర్మాత గా కూడా పలు సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. అల్లరి ప్రియుడు, ఇద్దరు మిత్రులు లాంటి సినిమాలు ఈయన నిర్మించినవే. చివరగా 2004 లో తన కొడుకు ప్రకాష్ రావు దర్శకత్వం వహించిన బొమ్మలాట అనే సినిమాను నిర్మించాడు.

అయితే దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక సినిమాను నిర్మిస్తున్నారు రాఘవేంద్రరావు. కామెడీ, మెసేజ్ రెండు ఉండేలా “సర్కారు నౌకరి” అనే సినిమాను నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శాండిలియా పిసపతి అనే వ్యక్తి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఆకాష్ గోపరాజు ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. జులై1 న ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా తెలంగాణా నేపథ్యంలో ఉండనుందని టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అర్ధం అవుతుంది. సర్కారు నౌకరి అంటే ప్రభుత్వ ఉద్యోగం అని తెలిసిందే. ఈ పదం తెలంగాణా యాసలో ఉపయోగిస్తారు. ఇక ఈ సినిమాలో హీరో బహుశా గవర్నమెంట్ నియమించే డాక్టర్ ఉండవచ్చు. అంతే కాక హీరో డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే 90స్ లో జరిగే కథలా ఉంది. హీరో వెనకాల చెట్టుకి “పెద్ద రోగం, చిన్న ఉపాయం” అంటూ రెడ్ క్రాస్ గుర్తుతో ఒక బాక్స్ తగిలించి ఉంది. దీంతో ప్రభుత్వ వైద్య విధానాన్ని సెటైర్ వచ్చేలా సినిమా ఉండబోతుందని అనిపిస్తుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు