Lust stories : ప్రభాస్ పై తమన్నా ఫైర్- పెద్ద సినిమాలు చేస్తున్నాడు అయితే ఏంటి ?

మిల్క్ బ్యూటీ తమన్నా ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెబెల్, బాహుబలి సినిమాలలో తమ్మన్నా ప్రభాస్ తో కలిసి నటించగా వీరిద్దరూ షూటింగ్ సమయంలో క్లోజ్ అయ్యారంట, తరుచుగా కలుస్తూ, మాట్లాడుతుండే వారంట. దాంతో వీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట. అయితే గత కొద్దికాలం నుంచి ప్రభాస్ తమన్నాతో మాట్లాడటం పూర్తిగా మానేసాడంట, దాంతో ప్రభాస్ పై తమన్నా ఫైర్ అయింది.

ఇటీవలనే తమన్నా జీ కార్డా, లస్ట్ స్టోరీస్ అనే సిరీస్ లలో నటించిన విషయం తెలిసిందే. గతంలో హీరోయిన్ గా మంచి, మంచి పాత్రలలో నటించిన ఈమె, ప్రస్తుతం బోల్డ్ క్యారెక్టర్స్ మరియు ఎక్స్ పోజింగ్ చేసే పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెల్సుతోంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న భోళా శంకర్ సినిమా మరియు రజనీకాంత్ హీరోగా వస్తోన్న జైలర్ సినిమాలలో నటిస్తున్న తమన్నాకు ఈ రెండు సినిమాలు తప్ప వేరే సినిమాలేవీ చేతిలో లేవు. దాంతో తమన్నా చేతికందొచ్చినా ఏ అవకాశాలను వదులుకోవడం ఇష్టం లేక అన్నిటికి ఒకే చెప్పేస్తుంది.

ఇక లస్ట్ స్టోరీస్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న తమ్మన్నా ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెద్ద, పెద్ద సినిమాలు చేస్తుండటం వాళ్ళ తనని పూర్తిగా మర్చిపోయాడని, అస్సలు తనతో మాట్లాడటం లేదని, ఆమె చెప్పింది. అంతేకాదు ఈసారి గనక ఆమెకి ప్రభాస్ తో మాట్లాడే అవకాశం వస్తే.. సినిమాలు చేస్తే ఫ్రెండ్స్ ను మర్చిపోతావా అని గట్టిగ అడిగేస్తా అని చెప్పగా ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు