Rangabali: కమెడియన్ సత్య ఇంటర్వ్యూ ఎందుకు రాలేదు?

టాలీవుడ్ లో సరికొత్త గా సినిమాలు వస్తున్న నేపథ్యంలో వాటిని ప్రమోట్ చేసేందుకు కూడా మేకర్స్ భిన్నంగా ఆలోచిస్తున్నారు. అలా వచ్చిన వాటిలో విశ్వక్ సేన్ నటించిన (AVAK) సినిమా ప్రమోషన్, అలాగే జాతి రత్నాలు టీజర్ లాంచ్, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీ మీమ్స్ పై వచ్చిన ఇంటర్వ్యూలు బాగా ఫేమస్ అయ్యాయి.

ఇప్పుడు అలాంటి ఇంటర్వ్యూ నే ఫన్ గా క్రియేట్ చేసారు “రంగబలి” చిత్ర యూనిట్. ఆ సినిమాలో నటించిన కమెడియన్ సత్య తో ప్రముఖ మీడియా ప్రతినిధులను, జర్నలిస్టు లను ఇమిటేట్ చేస్తూ హీరో నాగ శౌర్య తో ఒక ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. జూన్29న రిలీజ్ చేసిన ఆ ఇంటర్వ్యూ ప్రోమో బాగా వైరల్ అయ్యింది. ఆడియన్స్ కి తెగ నచ్చేసి తొందరగా పెట్టమని భారీగా కామెంట్లు పెట్టారు. తీరా చూస్తే ఇప్పటివరకు ఆ వీడియో రిలీజ్ చెయ్యలేదు. దీనిపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినబడుతున్నాయి.

ఈ ఇంటర్వ్యూ లో సత్య పలు న్యూస్ ఛానల్ లకి సంబంధించిన పాపులర్ జర్నలిస్ట్ లను ఇమిటేట్ చేస్తూ ఇంటర్వ్యూ చేసాడు. ఇది గమనించిన అందులో కొంతమంది మీడియా ప్రతినిధులు రంగబలి చిత్ర యూనిట్ ని సంప్రదించి ఆ వీడియో అప్లోడ్ చేయకూడదని రిక్వెస్ట్ చేసారని టాక్ నడుస్తుంది. మరికొంత మంది నెటిజన్లయితే అందులో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్ళని ఇమిటేట్ చేసారు కాబట్టి బహుశా చిత్ర యూనిట్ ని బెదిరించివుండవచ్చని టాక్. ఏది ఏమైనా ఒక్క ప్రోమో తోనే తమ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసుకున్నారు రంగబలి మేకర్స్. ఈ ఇంటర్వ్యూ గనక రిలీజ్ అయ్యి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయ్యేదని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు