Sreevishnu: సామజవరగమన 2డేస్ కలెక్షన్స్..జోరు పెంచాలి

శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సామజవరగమన బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాను రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రెబ మోనికా హీరోయిన్ గా నటించింది. జూన్ 29న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన మౌత్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా వెళ్తున్నారు.

ఇక సామజవరగమన విడుదలైన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 1.14కోట్ల షేర్ వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 94లక్షల షేర్ కలెక్షన్స్ సాధించింది. ఓవరాల్ గా రెండు రోజుల్లో సామజవరగమన ప్రపంచవ్యాప్తంగా 2.08 కోట్ల షేర్ ని 3.85 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. సామజవరగమన చిత్రం 3.50 కోట్ల టార్గెట్ తో విడుదలవగా ఇప్పటివరకు వచ్చిన వసూళ్లతో గమనిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా 1.42 కోట్లు కావాలి.

ఇక శుక్రవారం మరిన్ని కొత్త సినిమాలు రిలీజ్ కావడం వల్ల ఈ సినిమాకి రెండో రోజు గ్రోత్ ఎక్కువగా రాలేదు. కానీ మంచి హోల్డ్ నే చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా బాగా ఆడే అవకాశం ఉంది. ఇక శని, ఆదివారాల్లో ఈ సినిమా మంచి గ్రోత్ చూపిస్తే వారం తిరక్కుండానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా దీనికి పోటీగా రిలీజ్ అయిన సినిమాలకు దేనికి కూడా అంత పాజిటివ్ గా రెస్పాన్స్ రాలేదు. కాబట్టి అది ఈ సినిమాకి ప్లస్ అవనుంది. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు