Rajinikanth: జైలర్ ఫస్ట్ డే కలెక్షన్స్… రజినీ ఊరమాస్..

Jailer First Day Collections…

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంత ఎక్స్ పెక్ట్ చేసారో తెలిసిందే. గత కొంత కాలంగా ఫామ్ లో లేని రజినీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో చేస్తుండడంతో ఈ సినిమా పై భారీ బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ మెప్పించడంతో ఫ్యాన్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇక ఆగష్టు 10న రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

అయితే ఫస్ట్ డే మాత్రం అందరి అంచనాలని మించిపోయి భారీ కలెక్షన్లను సాధించింది ఈ సినిమా. రజినీకాంత్ 2.0 తరువాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది జైలర్. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ రేంజ్ లో కలెక్షన్ల మోత మోగించిన ఈ సినిమా, ఒక్కసారి ఏరియా వైస్ కలెక్షన్లను గమనిస్తే..
తమిళ నాడు – 22.85Cr
తెలుగు స్టేట్స్ – 12.50Cr(తమిళ్ వెర్షన్స్ కలిపి)
కర్ణాటక – 11.80Cr
కేరళ – 5.85Cr
రెస్ట్ అఫ్ ఇండియా – 3.10Cr
ఓవర్సీస్ – 35.10CR

ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా జైలర్ ఫస్ట్ డే 91.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కాగా 44.75 కోట్ల షేర్ వసూలు చేసింది. 125 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 80 కోట్ల వరకు రాబట్టాలి. అయితే తక్కువ రేట్లకి అమ్మడంతో మొదటివారంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. మరి రెండో రోజు జైలర్ హోల్డ్ ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు