Kushi: ఆ విషయంలో సమంత నంబర్ వన్ – క్రేజ్ మామూలుగా లేదుగా..!

లేడి సూపర్ స్టార్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో సమంత ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతోంది. నాగచైతన్యతో డైవర్స్ అయిన నాటి నుండి తనపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చినప్పటికీ, వాటి ప్రభావం సమంత కెరీర్ పై ఏ మాత్రం పడలేదు. వరుసగా లేడి ఒరిఎంటేడ్ సినిమాలతో హిట్స్ అందుకొని టాప్ హీరోయిన్ గా కోనసాగుతోంది సమంత. రీసెంట్ గా శాకుంతలం లాంటి డిజాస్టర్ వచ్చినప్పటికీ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆర్మాక్స్ సంస్థ తాజాగా రిలీజ్ చేసిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ జాబితాలో నంబర్ వన్ పొజిషన్ ను సొంతం చేసుకుంది సమంత.
అలియా భట్, దీపికా పదుకొనె లాంటి బాలీవుడ్ హీరోయిన్స్ దాటి సమంత ఈ ఘనత సాధించటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మాక్స్ సంస్థ రిలీజ్ చేసిన టాప్ 10 జాబితాలో సమంత తర్వాతి స్థానాల్లో ఆలియా భట్, దీపికా పదుకొనె ఉండగా సౌత్ నుండి నయనతార, కాజల్ అగర్వాల్, త్రిష, కీర్తి సురేష్, రష్మిక ఈ టాప్ టెన్ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. శాకుంతలం లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో ఖుషి సినిమా హిట్ అవ్వటం సమంతకు కీలకంగా మారింది. సెప్టెంబర్ 1న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమాకు సంబంధించి రెండు సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు