Sonakshi Sinha : రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Sonakshi Sinha : బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సోనాక్షి సిన్హా కూడా ఒకరు. తాజాగా ఈ బ్యూటీ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ‘హీరమండి: ది డైమండ్ బజార్’ సిరీస్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించింది. కాగా తాజాగా సోనాక్షి సినీ పరిశ్రమలో మహిళలకు అందుతున్న రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. అంతేకాదు ఆమె హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఎందుకు హీరోయిన్లను అలా అడుగుతారు?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ తన కెరీర్ ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉందని వెల్లడించింది. ఇప్పుడు తాను ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాత్రలు చేస్తున్నానని, అందులోనూ ఒక దానికి ఒకటి భిన్నంగా ఉండే రోల్స్ చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఒక నటిగా ఇది తనకు గొప్ప సమయం అని భావిస్తున్నాను అంటూనే తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నట్టుగా వెల్లడించింది. అయితే ఇప్పటికి తను రెమ్యూనరేషన్ కోసం పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. తన అర్హతకు తగ్గ రెమ్యూనరేషన్ అందుకోక పోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఫిలిం మేకర్స్ హీరోయిన్లను సంప్రదించినప్పుడు వాళ్లు సినిమాకు కరెక్ట్ గా సరిపోతారని, ఉపయోగపడతారని ఆలోచిస్తారు. కాబట్టే ఆఫర్ తో హీరోయిన్ల దగ్గరికి వస్తారు. కానీ రెమ్యునరేషన్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ హీరోయిన్ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని పట్టుబడతారు. అలా ఎందుకు జరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

- Advertisement -

పోరాడవలసిన యుద్ధం ఇది…

ఇది జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది. స్త్రీలుగా మనం పోరాడవలసిన యుద్ధం ఇది. ఇప్పటికే మేము చాలా యుద్ధాలు చేస్తున్నాము. వాటిలో రెమ్యూనరేషన్ కోసం పోరాటం కూడా ఒకటి” అంటూ తన తోటి హీరోయిన్లకు పిలుపు నిచ్చింది ఈ బీ టౌన్ బ్యూటీ. సోనాక్షి సిన్హానే కాకుండా చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో చూపే మగ, ఆడ వివక్షత పై ఇప్పటికే నోరు విప్పారు. హీరోలకు అందే రెమ్యూనరేషన్ తో పోలిస్తే హీరోయిన్లకు అతి తక్కువగా అందుతుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి సోనాక్షి సిన్హా తెరపైకి తీసుకురావడంతో హాట్ టాపిక్ గా మారింది.

దబాంగ్ తో ఎంట్రీ

సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా సోనాక్షి సిన్హా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ‘దబాంగ్’లో ఆయనతో తొలిసారిగా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. ‘అకీరా’, ‘నూర్’, ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’ వంటి సినిమాల్లో సోలో హీరోయిన్‌గా కనిపించింది. కానీ ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ కాలేకపోయాయి.

ఎంత కష్టపడినా అదే ఫలితం

సోనాక్షి మాట్లాడుతూ ‘నేను ఎంత కష్టపడినా కొన్నిసార్లు సినిమా విజయం సాధించలేదు. తర్వాత పాత్రల ఎంపికను పూర్తిగా మార్చుకున్నాను. కొన్ని విజయవంతమయ్యాయి, కొన్ని కాలేదు. ఆర్టిస్ట్‌గా ఆ సినిమాలను ఆస్వాదించాను. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవచ్చు. అయితే టీమ్‌లోని కొందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అయినా ఎందుకు విజయం సాధించడం లేదని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా. సినిమా,  బాక్సాఫీస్ భవిష్యత్తు నా చేతుల్లో లేదు. అది నాకు కూడా తెలుసు. నటిగా నా వంతు ప్రయత్నం చేయాలి. నా నటనకు ఎప్పుడూ ప్రశంసలు వచ్చేవి. ఇప్పడు మాత్రం నాకు నటిగా మంచి సమయం వచ్చేసింది’ అని సోనాక్షి అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు