Varun Sandesh Upcoming Movie: వరుణ్ సందేశ్‌ కొత్త మూవీ అప్డేట్… ఇది పరీక్షే..!

Varun Sandesh Upcoming Movie: వరుణ్ సందేశ్.. ఈ పేరు ప్రస్తుతం పెద్దగా వినిపించకపోయినా గతంలో గట్టిగా మారు మోగింది. హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ నటుడు అనంతరం కొత్త బంగారులోకం వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుని స్టార్ హీరోగా నిలిచాడు.

కానీ ఆ తరువాత సరైన కథలను ఎంచుకోకపోవడం.. అదృష్టం కలిసి రాకపోవడం కారణంగా ఈయన కెరీర్ పూర్తిగా స్పాయిల్ అయిపోయింది. ఒకానొక సమయంలో స్టార్ హీరోగా కొనసాగిన ఈ నటుడు ప్రస్తుతం అడపాదడపా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో ఉన్నాను అనిపించుకుంటున్నాడు. ప్రెసెంట్ వరుణ్ సందేశ్ చేసే ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడం కారణంగా ఈయన పేరు టాలీవుడ్ లో చాలా తక్కువగా వినిపిస్తుంది.

varun-sandeshs-new-movie-update-this-is-a-test
varun-sandeshs-new-movie-update-this-is-a-test

గతంలో లాగా మరోసారి తన పేరును టాలీవుడ్ లో ముద్ర వేసేందుకు నింద మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు వరుణ్ సందేశ్. ఇక ఈ మూవీ టీజర్ రేపు అనగా మే 16 వ తారీకున రిలీజ్ చైనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ చిత్రానికి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ మూవీ తో అయినా మరోసారి ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు