Prabhas’s Salaar: వీఎఫెక్స్ కొంప ముంచుతోందా..? – ఇకనైనా డైరెక్టర్స్ మేలుకుంటారా..?

Prabhas’s Salaar

ప్రస్తుతం వెఎఫెక్స్ లేకుండా సినిమాలు చేయడం అసాధ్యం అనే పరిస్థితి ఉందని అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఐడియాన్ సినిమా మార్కెట్ స్పాన్ రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు ఫిలిమ్ మేకర్స్.

ఒక పక్క సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వటానికి కారణం అవుతూనే సినిమా ఫెయిల్ అవ్వటానికి కూడా కారణం అవుతుంది. వీఎఫెక్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఎక్కువవుతున్న క్రమంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమయ్యి రిలీజ్ డిలే అవుతూ వస్తోంది. రీసెంట్ ప్రభాస్ కి డిజాస్టర్ తెచ్చి పెట్టిన ఆదిపురుష్ సినిమా ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సలార్ సినిమా విఎఫెక్స్ కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ప్రభాస్ నెక్స్ట్ మూవీ కల్కిలో కూడా వీఎఫెక్స్ కీలకంగా ఉన్నాయని, అందువల్లే కల్కి సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాలో కూడా వీఎఫెక్స్ కి ఎక్కువ స్కోప్ ఉందని అంటున్నారు.  ఆ రకంగా సినిమాకి ప్లస్ అవ్వాల్సిన వీఎఫెక్స్ భారంగా మారుతున్నాయి.

- Advertisement -

అంతే కాకుండా ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ బ్రో సినిమా విషయంలో కూడా అవసరం లేకపోయినా కానీ, సీజీ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వటమే కాకుండా విఎఫెక్స్ క్వాలిటీ చాలా పూర్ గా వచ్చింది. సినిమా ఫెయిల్ అవ్వటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఫిలిమ్ మేకర్స్ విఎఫెక్స్ కి ప్రాధాన్యత ఇవ్వటం మానేసి కంటెంట్ మీద ఫోకస్ పెడితే ఆదిపురుష్ లాంటి డిజాస్టర్స్ రిపీట్ కాకుండా ఉండే ఛాన్స్ ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు