Kushi : సొంత ఇంట్లో ఆడపిల్లల గోడు వినని వాడు కూడా సమంత ఎలా ఉండాలో చెప్పేవాడే..

Kushi

పూర్వకాలంలో పెద్దలు అన్నారు ముందు ఇంట గెలిచి తరువాత రచ్చ గెలవమని.. అయితే ఇటీవల కాలంలో మాత్రం జనాలు ఇంట్లో ఉన్న సమస్యలతో పోరాడి గెలుస్తున్నారో లేదో.. తెలీదు గాని సినిమా రివ్యూలలో మాత్రం రెచ్చిపోయి మరీ సెలెబ్రెటీలకు సలహాలు ఇస్తున్నారు. అయిన సలహాలు ఇవ్వడంలో తెప్పేముంది, భారత దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా.. అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. సలహాలు ఇవ్వడం.. చూసిన సినిమా గురించి మాట్లాడటం ముమ్మాటికీ తప్ప్పు కానే కాదు. కానీ ఒక మనిషి మీదా అదే పనిగా కక్ష్య గట్టినట్టుగా, అత్యంత దారుణంగా కించపరిచేలా మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా తప్పే.

అయితే మరి ఈ తప్పు ఒప్పుల గురించి ఇప్పుదెందుకు మాట్లాడవలసి వస్తుందంటే. విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటిన రిలీజైన విషయం అందరికి తెలిసిందే. శాకుంతలం, లైగర్ లాంటి డిజాస్టర్ సినిమాల తరువాత విజయ్ సమంతలు నటించిన ఈ చిత్రం ఇటీవలనే థియేటర్స్ లో రిలీజై.. విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

కాగా ఖుషి సినిమా కొంతమందికి బాగా నచ్చితే, మరికొంత మందికి పెద్దగా నచ్చలేదు. ఓవర్ అల్ గా మాత్రం చూస్తే ఖుషి సినిమా వన్ టైం వాచ్ మూవీ లిస్ట్ లో ఒకటిగా పడిపోయింది. అయితే ఈ సినిమా కొంతమందికి నచ్చడానికి కారణం విజయ్ దేవరకొండ, సమంతల మధ్య కెమిస్ట్రీ కారణం అయితే , ఖుషి సినిమా నచ్చని వాళ్ళు మాత్రం ఈ సినిమాలో సమంత కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటించడం గురించి కొన్ని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంత సేపు తన వైవాహిక జీవితం గురించి తీస్తూ సమంత బరితెగించింది, అది ఇది అంటూ సమంత ఎలా ఉండాలి, ఎలాంటి సినిమాలు తీయాలనే విషయంపై ఉచిత సలహాలు ఇస్తూ ఎదో ఆమెకి మేలు చేసినవాళ్లలా ఫీల్ అవుతున్నారు. మరీ ఈ రకంగా దిగజారుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళు తమ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుంటే బాగుంటుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు