Sujeeth: ‘ఓజి’ ఆల్ టైం రికార్డ్.. ఫ్యాన్స్ కి మామూలేగా?

Sujeeth:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరు పాన్ ఇండియా సినిమాలతో, బడా డైరెక్టర్లతో హిట్లు కొట్టి ఊగుతుంటే, రీజనబుల్ సినిమాలతో, చిన్న డైరెక్టర్లతో బ్లాక్ బస్టర్లు కొట్టి ఇండస్ట్రీనే ఊపేసే సత్తా తనది. అలాంటిది కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమా చేయట్లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారన్న సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు ఓజి తో పాత లెక్కలన్నీ సెట్ చేయడానికి సిద్ధమయ్యాడు పవర్ స్టార్. మొన్న వచ్చిన బ్రో సినిమాతో ఫ్యాన్స్ ని కొంతమేర డిస్సపాయింట్ చేసినా, జనాల్లో హైపే లేని రొటీన్ రీమేక్ సినిమాతో కూడా భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టి తన పవర్ చూపించాడు. అలాంటిది ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న వింటేజ్ పీకే గా వస్తే… రికార్డులు లెక్కపెట్టుకోవడానికి సోషల్ మీడియా స్ట్రక్ అవుద్దని తెలిసిందే.

పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న సినిమాపై ఆ రేంజ్ అంచనాలే ఉన్నాయి మరి. అనౌన్స్ చేసినప్పుడే పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అని ఫిక్సయిపోయినట్టున్నారు. అందుకే ఓజి గ్లిమ్ప్స్ రిలీజ్ అవగానే రికార్డ్స్ క్రియేట్ అయిపోయాయి. ‘హంగ్రీ ఛీతా’ పేరుతో రిలీజ్ అయిన ఆ వీడియోలో పవన్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అంతకి ముంచి చూపించేసరికి థ్రిల్ అయిపోయారు.

- Advertisement -

అందుకే సోషల్ మీడియా నుండే రికార్డులు మొదలయ్యాయి. గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్ వచ్చి పడ్డాయి. రిలీజ్ అయిన 24 గంటల్లో ‘ఓజి’ 731K లైక్స్ తో ఆల్ టైం రికార్డు కొట్టిపడేసింది. వ్యూస్ పరంగా కొంచెం స్లో అయినా, స్లో పాయిజన్ లా ఎక్కేస్తుంది. మరి సాంగ్స్ వచ్చాక ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings,

and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు