Bigg Boss Leaks: కంటెస్టెంట్స్ ఓవర్ కాన్ఫిడెంట్… 35 లక్షల ఆఫర్ రిజక్ట్

Bigg Boss Leaks

తెలుగు టీవీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైంది. శనివారం షూటింగ్ కూడా జరిగింది. ఇప్పటికే 14 మంది కంటెస్టెంట్స్ ఇంట్లో అడుగుపెట్టారు. మరో 5 గురు కంటెస్టెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. అయితే శనివారం జరిగిన షూటింగ్‌ను ఈ రోజు సాయంత్రం టెలికాస్ట్ చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.

ప్రతీ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌కి ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చి దానిలో కొంత డబ్బు ఉందని, అది తీసుకుని ఇంటిని నుంచి బయటికి వెళ్లొచ్చు అని హోస్ట్ నాగార్జున చెప్పేవారు. కానీ, ఈ సీజన్‌లో స్టార్టింగ్ ఎపిసోడ్‌లోనే 14 మంది కంటెస్టెంట్స్‌కి నాగార్జున ఈ బ్రీఫ్ కేస్ ఆఫర్ ఇచ్చాడు.

ఫస్ట్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన ప్రియాంక వెళ్లి హౌస్‌లోకి బ్రీఫ్ కేసుని తీసుకుని వస్తుంది. అయితే దీనిపై కంటెస్టెంట్స్ అందరూ సుదీర్ఘంగా ఆలోచించి, బ్రీఫ్ కేసు ఆఫర్‌ను రిజక్ట్ చేస్తారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలిసింది ఏంటంటే? నాగార్జున ఆఫర్ చేసిన బ్రీఫ్ కేసులో 35 లక్షలు ఉన్నాయట.

- Advertisement -

అది తెలిసిన పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆ ఆఫర్‌ను తీసుకోవాల్సింది అంటూ ఫీల్ అయ్యారని సమాచారం. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రావడం వల్ల ఎంతో కొంత ఫేమ్ & నేమ్ వస్తుందని, దాంతో సినిమాల్లో ట్రై చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో వస్తారు. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కూడా అదే గోల్ తో వచ్చారు. దాంతోనే నాగార్జున ఆఫర్ చేసిన బ్రీఫ్ కేస్ ను రిజక్ట్ చేశారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు