Mark Antony: విశాల్ భార్య కాబోతున్న అభినయ..!

Mark Antony:

గత ఏడాదిగా హీరో విశాల్ – నటి అభినయని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీరిద్దరూ పెళ్ళికి రెడీ అయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలపై విశాల్ ఇంతవరకు స్పందించలేదు కానీ.. నటి అభినయ మాత్రం ఆ వార్తల్లో వాస్తవం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన విశాల్ పై ఇటువంటి రూమర్స్ రావడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ ప్రేమాయణం కొనసాగించాడు అంటూ తెగ ప్రచారం జరిగింది.

కానీ విశాల్ మాత్రం హైదరాబాద్ కి చెందిన అనీషా తో నిశ్చితార్థం చేసుకొని షాక్ ఇచ్చాడు. కానీ పెళ్లి మాత్రం రద్దయింది. అయితే ఇందుకు కారణం తెలియదు కానీ నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత వాళ్లు తమ పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్ ని ఉద్దేశిస్తూ అభినయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినయ విశాల్ కు తాను వీరాభిమానినని.. ప్రేమ చదరంగం నుంచి ఆయనని ఇష్టపడుతున్నానని తెలిపింది. విశాల్ తో తన పెళ్లి జరగనుందంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించింది.

విశాల్ కి తాను భార్యని కాబోతున్నానని చెప్పింది అభినయ. నా కళ నెరవేరింది అంటూ అభినయ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నిజంగానే విశాల్ – అభినయ పెళ్లి చేసుకోబోతున్నారా..? అనే విషయానికి వస్తే ఇది నిజజీవితంలో కాదు. రీల్ లైఫ్ లో అభినయ విశాల్ భార్యగా నటించబోతుందట. ఈ విషయాన్ని అభినయ ప్రస్తావిస్తూ.. నేను చాలా రోజులుగా విశాల్ ని కలవాలని కలగన్నానని తెలిపింది. ఆకల మార్క్ ఆంటోనీ సినిమాతో నెరవేరిందని.. ఈ సినిమాలో తాను విశాల్ కి భార్యగా నటిస్తున్నానని తెలిపింది. విశాల్ భార్యగా నటించినందుకు చాలా సంబరపడిపోతున్నానని తెలిపింది. ఇక మా పెళ్లి అంటూ వస్తున్న వార్తలు కూడా అన్ని పుకార్లేనని మరోసారి స్పష్టం చేసింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు