Telugu Actress: ఆ స్టార్ హీరోతో ఎఫైర్ వల్లే కళ్యాణి తన భర్తతో విడాకులు తీసుకుందా..?

Telugu Actress:

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్లలో కళ్యాణి కూడా ఒకరని చెప్పవచ్చు. ఈమె ఒకప్పుడు ఎంతో మంచి హోమ్లీ పాత్రల్లో నటించి కుటుంబ కథ ప్రేక్షకులను అలరించింది. జగపతిబాబు, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో శేషు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, పందెం, వసంతం, పెళ్ళాంతో పనేంటి, ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలలో నటించింది. ఈమె దర్శకుడు సూర్యకిరణ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన కొన్ని సంవత్సరాలకే అతనితో విడాకులు తీసుకుంది కళ్యాణి.

అయితే చాలామందికి వీరి వీడాకులకు గల కారణం ఏమిటనేది తెలియదు. ఆ మధ్య సూర్యకిరణ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి వివాహ బంధానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదట్లో అంతా తమది ప్రేమ వివాహం అనుకున్నారని.. కానీ మాది పెద్దలు కుదిరిచిన వివాహమని క్లారిటీ ఇచ్చారు. అయితే వీరి విడాకులకు సంబంధించి మరో వార్త అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరోతో కళ్యాణి ఎఫైర్ పెట్టుకోవడం వల్లే సూర్య కిరణ్ కి, కళ్యాణ్ కి మధ్య విభేదాలు వచ్చాయని.. ఫలితంగా వీరు విడిపోవాల్సి వచ్చిందంటూ వార్తలు వినిపించాయి.

ఆ హీరో మరెవరో కాదు జగపతిబాబు. వీరిద్దరి కాంబినేషన్ లో ఐదు సినిమాలు తెరకెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వరుసగా సినిమాలు వచ్చేసరికి వీరి మధ్య ఏదో నడుస్తుందని ఓ వార్త గుప్పుమంది. అయితే కళ్యాణికి పెళ్లి అయ్యాక కూడా ఇవే వార్తలు వినిపించేసరికి ఈ విషయంలో సూర్యకిరణ్ కళ్యాణి తో గొడవ పెట్టుకున్నారట. దాంతో అలాంటిదేమీ లేదని కళ్యాణి సర్ది చెప్పినప్పటికీ సూర్యకిరణ్ ఈ విషయాన్ని తరచూ ప్రస్తావించేసరికి విసుగు వచ్చి తన భర్తకు విడాకులు ఇచ్చేసిందని అప్పట్లో ఈ రూమర్ వైరల్ అయింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు