Bigg Boss Season7: బిగ్ బాస్ సాక్షిగా కోడలిని గుర్తు చేసుకున్న నాగార్జున..!

Bigg Boss Season7

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ రోజు స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ కి హీరోలు నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో ప్రోమోలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

విజయ్ సమంత కలిసి నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ కి హాజరైన విజయ్ ని ‘ ఏది మీ హీరోయిన్ ఎక్కడా ?’ అంటూ నాగార్జున అడగటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన కొడుక్కి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటికీ నాగార్జున కెమెరా ముందు సమంత ప్రస్తావన తేవటం అతని ప్రొఫెనలిజానికి నిదర్శనం అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

నాగచైతన్యతో డైవర్స్ అయినప్పటి నుండి సమంతపై అక్కినేని ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ తో దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత సినిమా రిలీజ్ అయినా, తన ఇంస్టాగ్రామ్ లో ఏదైనా ఫోటో పోస్ట్ చేసినా తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతుంటారు అక్కినేని ఫ్యాన్స్. అయితే, ఇప్పుడు నాగ్ ప్రవర్తన వారందరికీ స్లిప్పర్ షాట్ లా మారిందనే చెప్పాలి.

- Advertisement -

నాగార్జున మాటలతో పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషన్ వేరు అన్నది ప్రూవ్ అయ్యింది. గతంలో బిగ్ బాస్ వేదికపై సమంత ఓ బేబీ సినిమా ప్రమోషన్స్ కి హాజరవటమే కాకుండా, నాగార్జున అందుబాటులో లేని టైం షో కి హోస్ట్ గా కూడా వ్యవహరించింది. మొత్తానికి బిగ్ బాస్ వేదిక మీద నాగార్జున సమంత పేరు ప్రస్తావించటం వైరల్ గా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు