Bigg Boss Season7: పెళ్లి చేసుకోమంటున్న తమన్నా – పారిపోతున్న కమెడియన్..!

Bigg Boss Season7

బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి ఇంస్టాగ్రామ్ యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. తాజాగా తాను పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. తన ఫ్రెండ్స్ అయిన బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ జబర్దస్త్, అవినాష్, ఆర్జే చైతు, శ్రీముఖిలను కలిసిన తమన్నా అవినాష్, చైతులకు రాఖి కట్టింది.

ఆ వీడియోలో తమన్నా రాఖీతో పాటుగా తాళి కూడా కట్టమని అడగటంతో ఫన్ జెనరేట్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్7 లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బిగ్ బాస్ షో ద్వారా ఏర్పడ్డ వీరి స్నేహం ఇప్పటికి అలాగే కొనసాగుతోంది. తరచూ ఎక్కడైనా కలుస్తూ సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.

బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ ఎపిసోడ్ ఈ రోజు టెలికాస్ట్ కానున్న నేపథ్యంలో రిలీజ్ చేసిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షోకి గెస్ట్ గా వచ్చిన హీరో విజయ్ దేవరకొండతో నాగార్జున ఏది మీ హీరోయిన్ సమంత అని అడగటం ప్రోమోకి హైలైట్ గా నిలిచింది. నాగార్జున సమంత ప్రస్తావన తేవటంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి నాగార్జున మాటలు స్లిప్పర్ షాట్ లాగా ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ సీజన్7 స్టార్ట్ అవ్వటంతో సోషల్ మీడియాలో మల్లి సందడి నెలకొంది. మరి, ఈ సీజన్ లో ఎలాంటి కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయో, ఎవరెవరు ఫేమస్ అవుతారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు