Kushi:ఇంతకీ సక్సెస్ క్రెడిట్ ఎవరికి?

Kushi:

టాలీవుడ్ లో గత నెలలో వచ్చిన తెలుగు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోగా, సెప్టెంబర్ నెలలో మాత్రం గట్టిగానే బోణి కొట్టింది. విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన ఖుషి సినిమాపై ఆడియన్స్ లో ఏ రేంజ్ లో అంచనాలు ఉండేవో తెలిసిందే. కేవలం పాటల తోటే హైపెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

రిలీజ్ కి ముందు ప్లాపుల్లో ఉన్న హీరో, హీరోయిన్ల తో పాటు, డైరెక్టర్ శివ నిర్వాణ కి కూడా కం బ్యాక్ వచ్చినట్టే అని చెప్పాలి. మరి బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకపోయినా వన్ టైం వాచెబుల్ గా ఈ సినిమా అలరిస్తుంది. అయితే ఖుషి సినిమా సక్సెస్ తో అందరికి మంచి కం బ్యాక్ దక్కినప్పటికీ ఈ సక్సెస్ లో ఎవరికీ క్రెడిట్ ఇవ్వాలనేది చర్చనీయాంశమైంది. కొంతమంది
ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ అంటుంటే, మరి కొందరు సమంత అని అంటున్నారు.

మరో వర్గం ప్రేక్షకులు మాత్రం శివ నిర్వాణ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమా హిట్ కావడానికి కారణం అని అంటున్నారు. అయితే కామన్ ఆడియన్స్ మాత్రం దాదాపుగా ఖుషి హిట్ కావడానికి మేజర్ క్రెడిట్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్లా కే దక్కుతుందని అంటున్నారు. ట్రేడ్ విశ్లేషకులు కూడా మ్యూజిక్ వల్లే సినిమా నిలబడిందని, సినిమా ట్రైలర్ కంటే, పాటలు విని థియేటర్లకు వచ్చిన జనాలే ఎక్కువ అని అంటున్నారు. అయితే ఇది ఒప్పుకొని కొండన్న, సామ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో,హీరోయిన్ల క్రేజ్ వల్లే ఖుషి ఆడుతుందని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు