Bigg Boss Telugu 7: ఈ సారి కంటెస్టెంట్స్ ను ఆ విషయంలో మెచ్చుకోవచ్చు

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం ఈసారి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో హౌస్ మేట్స్ ఎంపిక విషయంలో యాజమాన్యం సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల ప్రేక్షకుల నుంచి బిగ్ బాస్ షో పై చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. దాంతో సీజన్ సెవెన్ విషయంలో బిగ్ బాస్ టీం అతి తూచి వ్యవహరించింది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంకొంతమంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టబోతున్నారని వార్తలు వస్తోన్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇక ఈ సీజన్ లో ప్రస్తుతం ఉన్న 13 మంది కంటెస్టెంట్స్ ను గత సీజన్ల కంటెస్టెంట్స్ తో పోల్చి చూస్తే చాలా విషయాలలో మెరుగ్గా కనిపిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ టాస్క్ లలో పర్ఫామ్ చేయడంలో గాని అందరు కూడా వారి వారి స్థాయికి తగ్గట్టు పాల్గొంటు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో కంటెస్టెంట్స్ ప్రవర్తించిన తీరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది గత సీజన్ లలో కంటెస్టెంట్స్ నామినేషన్ వచ్చిందటే చాలు పర్సనల్ గాడ్జ్ పెట్టుకొని ఓవర్ డ్రామా చేసేవాళ్లు అలాగే నామినేషన్స్ అయిపోయాక కూడా వాళ్ళ కోపాలు అలాగే ఉండేవి. కానీ ఈ సీజన్ కంటెస్టెంట్స్ అలా లేరు. సోమవారం జరిగిన నామినేషన్స్ లో గొంతు పగిలేలా అరుచుకొని, తిట్టుకున్నా అందరు నామినేషన్స్ అయిపోగానే మళ్ళీ ఒకరి దగ్గరికి ఒకరు వెళ్లి క్షమాపణలు చెప్పుకొని వెంటనే కలిసి పోతున్నారు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో నిజంగా ఇది మెచ్చుకోవలసిన విషయం అనే చెప్పాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు