Bollywood: ఆ క్రేజీ సినిమా తెలుగు రైట్స్ దిల్ రాజు చేతికి..!

Bollywood:

టాలీవుడ్ లో ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు కూడా తెగ ఆడేస్తున్నాయి. మొన్న బ్రహ్మాస్త్ర, నిన్న పఠాన్, నేడు జవాన్. ఈ సినిమాలు భారీ హైప్ తో రిలీజ్ అయ్యి ఏకంగా తెలుగులో మీడియం రేంజ్ సినిమాల లెవెల్లో భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ అయిన జవాన్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 50కోట్లకి పైగా వసూలు చేసి షాక్ ఇచ్చింది. అందుకే రాబోయే హిందీ సినిమాలను బాలీవుడ్ మేకర్స్ వరుసబెట్టి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ టైగర్3 ని కూడా రిలీజ్ చేస్తుండగా, మరో బాలీవుడ్ సినిమా ‘అనిమల్’ కూడా రిలీజ్ అవుతుంది. నిజానికి అనిమల్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అనిమల్ మూవీ యొక్క తెలుగు రైట్స్ ని దిల్ రాజు దక్కించుకున్నాడట. దాదాపు 15కోట్ల రూపాయలకి పైగా డబ్బులు పెట్టి ఆ రైట్స్ కొన్నాడని టాక్ నడుస్తుంది.

అయితే దిల్ రాజు ఇంత పెట్టి అనిమల్ రైట్స్ కొనడానికి మెయిన్ రీసన్ ఈ సినిమాకి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కావడం అని నెటిజన్ల అభిప్రాయం. ప్రస్తుతం అనిమల్ కి ఉన్న బజ్ ప్రకారం 15కోట్లకంటే ఎక్కువ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు. మరి అనిమల్ రిలీజ్ టైం నాటికి వరల్డ్ వైడ్ గా ఎంత బిజినెస్ అవుతుందో చూడాలి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా అనిమల్ థియేట్రికల్ రైట్స్ 300కోట్లు ఉండొచ్చని అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు