Chandramukhi2 First Day Collections: తెలుగులో చంద్రముఖి2కి పెద్ద సవాలే…!

Chandramukhi2 First Day Collections

రజినీకాంత్ నటించిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. హర్రర్ సినిమాలకు చంద్రముఖి కెరాఫ్ ఆడ్రస్‌గా నిలిచిందని చెప్పొచ్చు. రజినీకాంత్ హర్రర్ సినిమాలో ఎలా నటిస్తాడో అనే చిన్న అనుమానం ఉండేది. కానీ, ఈ సినిమా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు, రజినీకాంత్ లో కొత్త కొణాన్ని చూపించింది. అంతే కాకుండా, సూపర్ స్టార్ కెరీర్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా పరిచయం చేసింది.

అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. అందుకే రాఘవ లారెన్స్ ముఖ్య పాత్రలో వచ్చిన చంద్రముఖి2పై అంచనాలు భారీగా పెరిగాయి. బిజినెస్ కూడా ఎక్కువే జరిగింది. 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అన్ని ప్రాంతాల్లో కలిపి 45 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. అందులో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 11 కోట్ల వరకు బిజినెస్ చేసుకుంది. లారెన్స్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల రూపాయల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. చాలా ఎక్కువే అని చెప్పాలి.

అంటే చంద్రముఖి2 బ్రేక్ ఈవెట్ పాయింట్ క్రాస్ అవ్వాలంటే, ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల కలెక్షన్లు రావాలి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే, దాదాపు 12 కోట్ల వరకు కలెక్షన్లు రావాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉన్నా.. తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు కష్టమే అనిపిస్తుంది. చంద్రముఖి2తో పాటు రిలీజ్ అయిన స్కందకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది.

- Advertisement -

దీంతో ప్రేక్షకులు థియేటర్స్ రావడం దాదాపు కష్టమే. ఇప్పుడు చంద్రముఖి2కి వచ్చిన టాక్ తో 12 కోట్ల కలెక్షన్లు రాబట్టడం గగనమే. మరీ స్కందను ఈ వీకెండ్‌లో క్రాస్ చేస్తే కొంత మేర అవకాశం ఉంటుంది. కాగా, ఫస్ట్ డే చంద్రముఖి2 కలెక్షన్లు 5.50 కోట్ల షేర్ ఉన్నట్టు తెలుస్తుంది.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు