Srikanth Addala: పెద కాపు పార్ట్ 2 పై ప్రొడ్యూసర్ తో గొడవ దిగిన శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో లేటెస్ట్ గా వచ్చిన పెద కాపు సినిమా గురించి అందరికి తెలిసిందే. ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ ను హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 29న థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కు ముందే పార్ట్ 1, పార్ట్ 2 అంటూ రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది.

కొత్త హీరో అయినప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్ తో పెద కాపు పార్ట్ వన్ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. సినిమా టైటిల్ కాంట్రవర్సీ గా ఉండటంతో పెద కాపు కు పబ్లిసిటీ కూడా బాగానే వచ్చింది. అలాగే ట్రైలర్, టీజర్ కూడా కాస్త ఆసక్తికరంగానే ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వచ్చాయి. కానీ తీరా రిలీజ్ తరువాత చూస్తే సినిమాలో విషయం లేకపోవడంతో మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

అయితే ముందు నుంచి పెద కాపు సినిమా రిజల్ట్ పైన నమ్మకంతో పార్ట్ 2 కూడా చేద్దామని ప్లాన్ చేశారట మేకర్స్ కానీ తీరా చూస్తే పార్ట్ వన్ డిజాస్టర్ అవడంతో పార్ట్ 2 చేయాల వద్ద అని ఆలోచనలో ఉన్నారట. ఇక ఇదే విషయంపై ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి కి మరియు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకు పెద్ద గొడవనే జరిగిందని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పెద కాపు పార్ట్ 2 సినిమా షుటింగ్ స్టార్ట్ చేద్దామని శ్రీకాంత్ అడ్డాల ప్రొడ్యూసర్ తో మాట్లాడట .. అయితే సినిమా తీవ్ర నష్టాలూ మిగిల్చిన బాధలో ఉన్న ప్రొడ్యూసర్ శ్రీకాంత్ అడ్డాలను.. నీకు సినిమా తీయడం రానందువల్లే పెద కాపు సినిమా ఫ్లాప్ అయిందని అయన పై అరిచాడట. ఇక దాంతో శ్రీకాంత్ అడ్డాల కూడా మీ బావమరిదిని లాంచ్ చేయడం కోసం అనవసరమైన హంగులు ఆర్భాటాలతో సినిమా బడ్జెట్ పెంచింది మీరే. ఇప్పుడు నష్టం వస్తే మాత్రం నన్ను అంటారా అని శ్రీకాంత్ అడ్డాల రివర్స్ అయ్యాడట. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేశారట. మరీ ఈ విషయంలో నిజమెంతో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు