Srikanth Addala: పెద కాపు కి ఫస్ట్ ఛాయిస్ ఆ మెగాహీరో

క్లాస్ సినిమాలకు కేరాఫ్ గా ఉండే శ్రీకాంత్ అడ్డాల, ఆయన లేటెస్ట్ సినిమా పెద కాపు తో తన ధోరణి మార్చి యాక్షన్ సినిమాల బాట పట్టిన సంగతి తెలిసిందే. అఖండ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల పెద కాపు సినిమా తెరకెక్కించాడు. ఇటీవలనే థియేటర్స్ లో రిలీజై ప్రేక్షకుల వద్ద నుంచి మిశ్రమ స్పందన అందుకుంటున్న పెద కాపు సినిమా నిజానికి శ్రీకాంత్ అడ్డాల ఒక మెగా ఫ్యామిలీ హీరోను మైండ్ లో పెట్టుకొని రాసుకున్నారట.

ఇక కథ రాయడం పూర్తయిన వెంటనే ఆ మెగా హీరో కు నరేషన్ కూడా ఇచ్చారట.. కానీ ఆ హీరో శ్రీకాంత్ అడ్డాలకు చెప్పిన కథ కు ఒకే చెప్పడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నాడట దాంతో పెద కాపు సినిమాఆ మెగా హీరో చేతిలో నుంచి చేజారి కొత్త హీరో దగ్గరికి వెళ్ళింది. ఇంతకి శ్రీకాంత్ అడ్డాల ఏ హీరోను మైండ్ పెట్టుకొని రాసుకున్నా ఆ మెగా హీరో ఎవరో తెలుసా.. ? ఆ హీరో మరెవరో కాదు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.

అవునండి నిజమే.. శ్రీకాంత్ అడ్డాల మొదటగా పెద కాపు సినిమాను సాయి ధరమ్ తేజ్ తో చేయాలని ప్లాన్ చేశారట. అయితే శ్రీకాంత్ అడ్డాల, సాయి ధరమ్ తేజ్ కు నరేషన్ ఇచ్చిన తరువాత ఎందుకో  సాయి ధరమ్ తేజ్ కు కథపై నమ్మకం లేక సినిమాకు ఒకే చెప్పడానికి సందేహించాడట. ఇక ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ కు విరూపాక్ష సినిమా షూటింగ్ కంప్లిట్ చేయాల్సి ఉండటం, ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేయాల్సి రావడంతో పెద కాపు సినిమాను సాయి ధరమ్ తేజ్ పక్కన పెడుతూ వచ్చాడట.

- Advertisement -

ఇక శ్రీకాంత్ అడ్డాల కూడా సాయి ధరమ్ తేజ్ స్పందన కోసం చాలా రోజులే ఎదురు చూశాడట, కానీ సాయి ధరమ్ తేజ్ నానాటికి ఆలస్యం చేస్తూ రావడంతో శ్రీకాంత్ అడ్డాల అసలు విషయాన్నీ గ్రహించి సాయి ధరమ్ తేజ్ కాకుండా పెద కాపు వేరే స్టార్ హీరో తో చేద్దామనుకున్నాడట. కానీ మళ్ళీ స్టార్ హీరోకు చెప్పి వాళ్ళ రీప్లే కోసం మరికొన్నిరోజుల తరబడి ఎదురు చూడటం కన్నా కొత్త వాళ్ళతో సినిమా చేయడం ఉత్తమం అని విరాట్ కర్ణ తో పెద కాపు సినిమాను తెరకెక్కించాడు. ఇక భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 29 న రిలీజైన ఈ సినిమా రిలీజై వారం రోజులు కూడా గడవకుండానే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు