Tollywood: పీకల్లోతు కష్టాల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభంలో నటించిన సినిమాల్లో సుస్వాగతం ఒకటి. ప్రేమకు సంబంధించి యువత ఆలోచనలను ఎంతో చక్కగా చూపించారు సినిమాలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ లో దేవయాని హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో పవన్, దేవయానిల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అప్పట్లో యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ నటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఇక పవన్ ప్రేమను తిరస్కరించే సంధ్య పాత్రలో దేవయాని నటన కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ముంబైకి చెందిన దేవయాని మొదటగా బాలివుడ్ లో కోయల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇదే క్రమంలో తమిళ్ సినిమా పరిశ్రమకు చెందిన డైరెక్టర్ రాజకుమారన్ తో ప్రేమలో పడింది దేవయాని. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2001 ఏప్రిల్ 9న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రాణించిన దేవయాని తర్వాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి అనంతరం పూర్తిగా కనుమరుగైపోయింది. దాదాపు 100 చిత్రాల్లో కనిపించిన ఆమె…. ప్రస్తుతం ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. చెన్నైలో తన పిల్లలు చదువుతున్న చర్చ్ పార్క్ స్కూల్లోనే బాధ్యతలను నిర్వర్తిస్తూ నెలకు కేవలం రూ. 10వేలు సంపాదిస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా అభిమానులు బాధపడుతున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు