Keerthy suresh: నడిరోడ్డుపై కీర్తి సురేష్ పై రేప్ అటెంప్ట్ !

కీర్తి సురేష్… దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు….. తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. నేను శైలజ అంటూ ప్రేక్షకులకు పరిచయమై… ఆ తర్వాత మహానటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఆమె తల్లిదండ్రులు ఇద్దరు సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో కీర్తి సినీరంగ ప్రవేశం సులభంగానే జరిగింది. చిన్ననాటి నుంచి నటనవైపు అడుగులు వేసింది కీర్తి. 2000వ సంవత్సరంలో బాలనటిగా కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా మహానటి సినిమాతో తన క్రేజ్ పెంచుకుంది కీర్తి సురేష్.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది. “నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో రోడ్డు మధ్యలో నా స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలోనే ఓ తాగుబోతు వచ్చి నాపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో ఒక్క నిమిషం ఆగి తన చెంప చెల్లుమనిపించాను. దీంతో అప్పుడే ఇలాంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు అందరూ మెచ్చుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు