Ram Charan: భర్త ముందే రామ్ చరణ్ కి లిప్ కిస్ పెట్టిన స్టార్ హీరోయిన్.. మరి ఇంత తెగింపు ఏంటి..?

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. నటనలో తండ్రినే మించిపోయాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకొని పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయాడు. ఒక్కో సినిమాతో తనని తాను మార్చుకుంటూ విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. అంతేకాదు ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. కీలక పాత్రలో హీరోయిన్ అంజలి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై విపరీతంగా అంచనాలను పెంచేసాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం లో నటించబోతున్నారని..

ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో కూడా ప్రేక్షకుల ముందు రాబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చరణ్ – కియారా అద్వానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

కియారా అద్వాని తన భర్త చూస్తుండగానే రామ్ చరణ్ కి లిప్ కిస్ చేసిందట. ఓ రోజు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో భాగంగా కియారా అద్వానీ భర్త సిద్ధార్థ మల్హోత్రా షూటింగ్ లోకేషన్ కి వచ్చారు. అయితే అదే రోజు వీరిద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలను షూట్ చేసే పనిలో దర్శకుడు శంకర్ బిజీగా ఉన్నారు.

ఈ సన్నివేశాలను షూట్ చేసే సమయంలో మీ ఆయన ముందు నేను లిప్ కిస్ పెడితే ఏం బాగుంటుందని చరణ్ అన్నారట. దీంతో ఇలాంటి వాటిలో నేను తడబడితే సిద్ధార్థ్ నన్ను ఎంకరేజ్ చేస్తారు.. ఏం పర్లేదు అంటూ కియారా చెప్పడంతో ఆరోజు సిద్ధార్థ్ ముందే వీరిద్దరి లిప్ కిస్ సన్నివేశాలను షూట్ చేశారట.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు