Animal: ప్రభాస్ నేను మీ యూనివర్స్ లో కలవగలమా? – రణబీర్ కపూర్!

రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “అనిమల్”. ఈ సినిమా కోసం బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారన్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన ఓ రేంజ్ లో ఉండి ఆడియన్స్ ని మెప్పిస్తుంది. సందీప్ వంగ స్టైల్ అఫ్ మేకింగ్ తో సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ అమాంతం పెంచేసింది. ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటికే యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుండగా, పలు యూట్యూబ్ రికార్డులని బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తుంది.

అయితే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఇండియా లో మేజర్ సిటీల్లో ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ చేరుకున్న మేకర్స్ అక్కడ ఓ ప్రమోషన్ లో భాగంగా రణబీర్ కపూర్ సందీప్ తరవాతి సినిమాపై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

అదేంటంటే అనిమల్ తర్వాత సందీప్ రెడ్డి రెబల్ స్టార్ ప్రభాస్ తో “స్పిరిట్” అనే సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి రణబీర్ కపూర్ సందీప్ తో మాట్లాడుతూ ఇండియాలో ఫేమస్ అవుతున్న స్పై యూనివర్స్ సినిమాల్లాగా మీరు కూడా సినిమా చేస్తారా?, ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్, అలాగే అనిమల్ ఈ రెండింటిని కలుపుతూ మా ఇద్దర్ని సందీప్ యూనివర్స్ లో కలిపి సినిమా చేస్తారా అని అడిగేసాడు.

- Advertisement -

దానికి సందీప్ రిప్లై ఇస్తూ, ఇప్పటివరకు నాకు ఆ ఐడియా రాలేదు, ఒకవేళ ముందు ముందు తీయాలన్న ఆలోచన వస్తే తప్పకుండా చెప్తా అని అన్నాడు. ఈ మాటకి ప్రెస్ మీట్ లో సౌండ్ హోరెత్తింది. నిజంగా సందీప్ రెడ్డి కూడా లోకి యూనివర్స్ లాగా తన సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు