Surekha-Supritha : ఎయిర్ పోర్టులో తల్లీకూతుర్ల రచ్చ.. కారణం అదేనా..?

తెలుగు సినిమా ప్రేక్షకులకు.. సోషల్ మీడియా ఫాలోవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేర్లు సురేఖ వాణి , సుప్రీత.. సురేఖ పలు తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. మరొకవైపు సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకుంది. కరోనా వచ్చిన తర్వాత వీరిద్దరూ భారీగా సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ మరింతగా అభిమానులకు దగ్గరయ్యారు అని చెప్పాలి.

అంతే కాదు ఇద్దరు చేసే డాన్స్ వీడియోలను మొదలుకొని గ్లామరస్ ఫోటోలు, హాట్ ఫోటోలను కూడా తరచుగా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వీరు పెట్టే పోస్టుల వల్ల అటు సురేఖ వాణి, ఇటు కూతురు సుప్రీత ఇద్దరు కూడా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారని చెప్పవచ్చు. అయినా సరే మితిమీరిన కామెంట్స్ కి అటు సురేఖ వాణి ఇటు సుప్రీత కౌంటర్ ఇస్తూ ఉంటారు.. ఇకపోతే తాజాగా వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో చేసిన రచ్చ.. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇది చూసేవారికి కొంచెం ఎబ్బేట్టుగా అనిపించినా.. వీరు షేర్ చేసిన ఆ వీడియో నెటిజన్లను అలరిస్తోందని చెప్పవచ్చు.

ఇకపోతే ఇలా ఉన్నట్టుంది ఎయిర్ పోర్ట్ లో వీరు రచ్చ చేయడానికి కారణం.. తాజాగా మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం భక్తకన్నప్ప. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సురేఖ వాణి కీలకపాత్ర పోషిస్తుంది. కన్నప్ప షూటింగ్లో పాల్గొనడానికి గత నెల రోజులుగా సురేఖ వాణి న్యూజిలాండ్ లోనే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే జరుగుతున్నట్లు సమాచారం. అందుకే నటీనటులందరినీ కూడా మోహన్ బాబు న్యూజిలాండ్ తరలించారు. తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో తాజాగా సురేఖ ఇండియా తిరిగి వచ్చింది.

- Advertisement -

నెలరోజులుగా తల్లికి దూరంగా ఉన్న సుప్రీత తల్లిని చూడగానే ఒక్కసారిగా వెళ్లి తల్లిని హత్తుకుంది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో కాస్త చాలా వైరల్ గా మారుతోంది. ఇకపోతే వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లే అయినప్పటికీ స్నేహితుల లాగా క్లోజ్ గా ఉంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు