Madonna Sebastian : చేతిలో పెగ్గుతో రెచ్చిపోయిన నాని హీరోయిన్

కొంతమంది హీరోయిన్లకు ఎంత అందం, ప్రతిభ ఉన్నా కాలం మాత్రం కలిసి రాదు. వాళ్లు నటించిన సినిమాలు హిట్ అయినా కూడా గుర్తింపు రాదు. ఒకవేళ అవకాశాలు వచ్చినా వాళ్ల కెరీర్ కు మాత్రం సరిగ్గా ఉపయోగపడవు. తాజాగా హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ పరిస్థితి టాలీవుడ్ లో ఇలాంటి సిచువేషన్ లోనే ఉంది.

అక్కినేని నాగచైతన్య “ప్రేమమ్” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో మడోన్నా ఓ హీరోయిన్ గా కనిపించింది. ఆ మూవీ హిట్ అవడంతో ఆ తర్వాత ఈ బ్యూటీ కి పలు ఆఫర్లు వచ్చాయి. కానీ క్రేజ్ మాత్రం రాలేదు. ఇక నాని “శ్యామ్ సింగ రాయ్” మూవీలో లాయర్ పాత్రలో మెరిసింది. ఆ మూవీ కూడా హిట్టే. కానీ ఆమె పాత్రకు పెద్దగా పేరు రాలేదు, నటనకు గుర్తింపు దక్కలేదు. ఆ మూవీ హిట్ క్రెడిట్ మొత్తం సాయి పల్లవి ఖాతాలోనే పడింది. అలాగే టాలీవుడ్ లో మడోన్నాకు ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు.

రీసెంట్ గా దళపతి విజయ్ హీరోగా నటించిన ‘లియో’ మూవీలో కనిపించింది. అసలు సినిమాలో ఆమె ఉందన్న సంగతి థియేటర్లో చూసేదాకా ఎవరికి తెలియదు. అలా ‘లియో’ మూవీలో హెలినా దాస్ గా కనిపించి అందరికీ సర్ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాలో ఒక అడుగు ముందుకేసి ఫైట్స్ చేస్తూ ఎమోషనల్ సీన్లు సైతం అదరగొట్టేసింది. లియో దాస్ అక్కగా ఎపిసోడ్ లో మడోన్నా కనిపించినంత సేపు ప్రేక్షకులు ఆమె నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి మడోన్నాను హెలినా దాస్ గానే పిలుచుకుంటున్నారు విజయ్ ఫ్యాన్స్.

- Advertisement -

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ చేతిలో పెగ్గుతో కనిపించి షాక్ అయ్యింది. ఓ గ్లాసులో పెగ్గేస్తూ ఫోటోకు ఫోజ్ ఇచ్చింది. పైగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరో పిక్ లో తన కండలు చూపిస్తూ యూత్ ను రెచ్చగొడుతోంది. ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ అలా మందు గ్లాస్ తో కనిపించడంతో అందరికీ షాకింగ్ గా ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. పాపులారిటీ కోసం చాలామంది నటీమణులు ఇలాంటి దారి ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమాల వల్ల కంటే ఈ పిక్స్ వల్లే మడోన్నాకు ఎక్కువగా ఫాలోయింగ్ పెరిగేలా కన్పిస్తోంది. మరి ఆ తరువాతైనా ఈ బ్యూటీకి మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు