ఇటీవల కాలంలో స్టార్ కపుల్స్ అంతా వరుసగా విడాకుల బాట పడుతున్న సంగతి తెలిసిందే. అలాగే కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరొక అడుగు ముందుకేసి స్వాతి ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో ఎఫైర్ పెట్టుకుంది అనే వార్తలు వినబడుతున్నాయి.
కలర్స్ స్వాతి తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ హీరోయిన్ గా మారి, నటనకు మాత్రమే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘డేంజర్’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి ఆ తర్వాత అష్టా చమ్మ, స్వామి రారా వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఆ తర్వాత ఈ బ్యూటీ అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిలైపోదామని భావించింది. అనుకున్నట్టుగానే 2018లో వికాస్ అనే పైలెట్ ను స్వాతి వివాహం చేసుకుంది. వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ జంట ఫారిన్ వెళ్ళిపోయింది. ఇక పెళ్లితో సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే “మంత్ ఆఫ్ మధు” అంటూ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
దానికి కారణం ఆమె తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అనే రూమర్స్ గుప్పుమన్నాయి. “మంత్ ఆఫ్ మధు” మూవీ ప్రమోషన్స్ లో ఇదే విషయాన్ని కొందరు సినీ జర్నలిస్టులు ఆమెను ప్రశ్నించగా, నా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఏ విషయాన్ని నేను బయట పెట్టాలనుకోవట్లేదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా మీ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, నా లైఫ్ నా ఇష్టం, నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు అంటూ కొందరిపై ఫైర్ అయ్యింది.
దీంతో ఆమె విడాకుల వార్తలకు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. కానీ తాజాగా ఆమె ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో ఎఫైర్ నడుపుతోందని ఫిలింనగర్ వర్గాలకు సంబంధించిన వారు చెవులు కొరుక్కుంటున్నారు. అది కూడా తను రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చిన “మంత్ ఆఫ్ మధు” ప్రొడ్యూసర్ తో ఆమె సహజీవం చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ సహజీవనం పెళ్లి దాకా వెళ్తుందా? ఈ ప్రొడ్యూసర్ తో ఎఫైర్ పెళ్ళికి ముందు నుంచే ఉందా? అందుకే తన భర్తతో విడాకులు తీసుకుందా? అసలు ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చిందా? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. దీంతో స్వాతిలో చాలా కలర్స్ ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.