Animal Pre Release event: ఈవెంట్స్ లో తడబడుతున్న సుమక్క… ఏజ్ బార్ సమస్యా…?

Animal Pre Release event : అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “యానిమల్” మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. మరో రెండ్రోజుల తరువాత థియేటర్లలో రచ్చ చేయబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. సోమవారం రోజు “యానిమల్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిన్న సాయంత్రం జరిగిన ఈ ఈవెంట్ కు రాజమౌళి, మహేష్ బాబు గెస్ట్ లుగా విచ్చేశారు. మరోవైపు స్టార్ యాంకర్ సుమ ఈ ఈవెంట్ ను హోస్ట్ చేసింది. తన స్పాంటేనిటీ, కామెడీ టైమింగ్, పంచ్‌లతో ఏ ఈవెంట్ ను అయినా ఉల్లాసభరితంగా నడిపే సుమ ఈ మధ్య తడబడుతోంది. దీంతో ఏజ్ బార్ కావడమే ఆమె సమస్యా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

తాజాగా జరిగిన “యానిమల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సుమ అలాగే చేసింది. ఈవెంట్ కు మహేష్ బాబు గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ‘యానిమల్’ మూవీలో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. గతంలో మహేష్, రష్మిక హీరోహీరోయిన్లుగా “సరిలేరు నీకెవ్వరు” అనే మూవీ వచ్చిన విషయం తెలిసిందే. “యానిమల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వేదికపై “సరిలేరు నీకెవ్వరు” జంట ఉండడంతో ఆ మూవీని గుర్తు చేసింది సుమ. రష్మికను ఆ సినిమాలోని పాట పాడమని కోరింది. అయితే సినిమా పేరును మర్చిపోయి “సరిలేరు నీకెవ్వరు” బదులు “సర్కారు వారి పాట” అని పలికి స్టేజ్ పైనే అందరికీ షాక్ ఇచ్చింది.

సుమ ఇలా తడబడడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రిలీజైన కార్తీ “జపాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఊపిరి” మూవీకి నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పేసింది. అసలు ఆ సినిమాను ఆలాంటి అవార్డు రాకపోవడంతో అప్పుడు ఆమెను బాగానే ట్రోల్ చేసారు. రీసెంట్ గా ‘సప్త సాగరాలు’ మూవీ ఈవెంట్ లో కూడా యాక్టర్ కమ్ డైరెక్టర్ అని సంబోధించి షాక్ ఇచ్చింది. దీంతో సుమకు ఏజ్ బార్ సమస్యలు వచ్చాయా? అనే ప్రశ్న స్టార్ట్ అయ్యింది అందరిలో. ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మతిమరుపు రావడం కామనే. ఈ సంఘటనలు అన్నీ చూసుకుంటే సుమలో కూడా ఆ లక్షణాలు కన్పిస్తున్నాయి. దశాబ్దాల పాటు యాంకరింగ్ చేస్తూ వస్తున్న సుమక్క ఇక పెట్టె బేడా సర్దేసుకునే టైం వచ్చేసిందని సెటైర్లు వేస్తున్నారు. కాగా “యానిమల్” మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు