Manchu Family : రీసెంట్ గా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ఎంతగా ముంచెత్తాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి బాధాకరమైన సమయాల్లోనే రియల్ హీరోలు ఎవరు అనే విషయం బయటపడుతుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ కోట్లలో విరాళాన్ని ప్రకటించి తాము రియల్ హీరోలమని నిరూపించుకున్నారు. కేవలం థియేటర్లలోనే కాకుండా రియల్ లైఫ్ లో తమను ఇంత పెద్ద స్టార్ ను చేసిన ప్రజలకు కృతజ్ఞతగా ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకుంటాము అనే విధంగా ఈ విరాళాల ద్వారా తమ మంచి మనసును చాటుకున్నారు. కానీ ఇండస్ట్రీలో ఒక తిరుగులేని కుటుంబం అని చెప్పుకునే మంచు ఫ్యామిలీ (Manchu Family) మాత్రం వరద బాధితుల గురించి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోట్లలో సంపాదిస్తున్న మోహన్ బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu) తెలుగు రాష్ట్రాల ప్రజలకి కష్టం వస్తే మాత్రం కరుడుగట్టిన గుండె అన్నట్టుగా కదలకుండా మెదలకుండా ఉండిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో కోట్లలో సంపాదన…
ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద మోత మోగించిన మోహన్ బాబు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తన ఇద్దరు వారసులను సినిమా ఇండస్ట్రీలోకి దింపినప్పటికీ వాళ్ళు తమ వారసత్వాన్ని నిలబెట్టుకోలేక పోయారు. అడపదడపా మోహన్ బాబు కూడా సినిమాలు చేస్తూ ఇప్పటికీ కోట్లలోనే సంపాదిస్తున్నారు. ఇక ఆయన నటించిన సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎంతవరకు చూస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే గతంలో జనాలు ఇచ్చిన ఆదరణతోనే ఆయన నేడు సీనియర్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. ఓవైపు సినిమాలతో సంపాదిస్తుంటే, మరోవైపు ఆంధ్రలో మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో కూడా కోట్లలోనే సంపాదిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప (Kannappa) అనే సినిమాకు ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో మోహన్ బాబు (Manchu Mohan Babu) కూడా నటిస్తూ ఉండడం విశేషం. మరి ఒక సినిమాకు ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టిన మోహన్ బాబు (Manchu Mohan Babu) ఫ్యామిలీ తెలుగు ప్రజలకు కష్టాలు అంటే మాత్రం నోరు మెదపక పోవడానికి కారణం ఏంటో వారికే తెలియాలి.
మీ కఠిన గుండె కరగలేదా?
వరదలు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలం చేశాయి. అయితే ప్రజల ఆదరణతోనే నేడు కోట్లకు పడగలెత్తిన మోహన్ బాబు కుటుంబం (Manchu Family) ఇప్పుడు మాత్రం వరద బాధితుల గురించి కనీసం పట్టించుకోలేదు. మరి ఆయన 500 కోట్లు పెట్టి తీసిన సినిమాను ప్రజలు పట్టించుకుంటారా? ఇప్పటికే మంచి ఫ్యామిలీ నుంచి సినిమా వస్తోంది అంటే పట్టించుకునే జనాలు లేరు. ఇలాంటి కష్ట సమయంలో కూడా వరద బాధితులకు సాయం చేయకుండా, కేవలం సినిమాపైన దృష్టి పెట్టిన ఈ ఫ్యామిలీకి కన్నప్ప (Kannappa) మూవీ రిజల్ట్ తోనే కళ్ళు తెరుచుకుంటాయేమో చూడాలి.