Mangalavaram: మంచి టాక్.. వీకెండ్ లో జోరు.. అయినా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు?

టాలీవుడ్ లో క్రేజీ అంచనాలతో రెండు వారాల కింద రిలీజ్ అయిన సినిమా “మంగళవారం”. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా రిలీజ్ అయింది. పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రత్యేక పాత్రలో నటించి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మౌత్ టాక్ తో మెల్లిగా కలెక్షన్లు సాధిస్తూ వచ్చింది.

అయితే ఇతర సినిమాల పోటీవల్ల వర్కింగ్ డేస్ లో డౌన్ అయిన మంగళవారం వీకెండ్స్ లో మాత్రం జోరు చూపిస్తుంది. మంగళవారం రిలీజ్ అయ్యి పది రోజుల పైనే అవగా, ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 8.47 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 9.74 కోట్ల షేర్ ని సాధించింది ఈ సినిమా. అయితే ఇప్పటికి మంగళవారం బ్రేక్ ఈవెన్ కాలేదు. ఎందుకంటే మంగళవారం 13 కోట్ల బిజినెస్ చేయగా, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 3.26 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి.

నిజానికి మంగళవారం సినిమా ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సింది. కానీ వైలెన్స్ తో కూడిన ఏ సర్టిఫికెట్ సినిమా అవడం వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. అందువల్ల వీకెండ్స్ లో కొంత దెబ్బ పడిందని చెప్పొచ్చు. పైగా ఈ వారం రిలీజ్ అయిన కోట బొమ్మాళి కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా ఎఫెక్ట్ కూడా దీనిపై పడనుంది. మరి మంగళవారం వర్కింగ్ డేస్ లో ఉన్న తక్కువ థియేటర్లలో ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు