Sandeep – Jyoti: సందీప్ మాస్టర్ – జ్యోతి మధ్య గొడవలు.. అతని వల్లేనా..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొని మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇదిలా ఉండగా సందీప్ మాస్టర్ ఊహించని విధంగా ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మరింతగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన సందీప్ మాస్టర్ తాజాగా తన భార్యతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయంతో ఇప్పుడు చూద్దాం.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన టేస్టీ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన కూడా తన ఆటతో ప్రేక్షకులను బాగా అలరించారు. సందీప్ మాస్టర్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయితే టేస్టీ తేజ 9వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఇక తేజ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీలతో మళ్ళీ ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టి, పలు కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా టేస్టీ తేజ , సందీప్ మాస్టర్ అలాగే ఆయన భార్య జ్యోతి రాజ్ తో కలిసి సందడి చేశారు. తాజాగా వీరు ముగ్గురు ఒక రెస్టారెంట్లో సందడి చేయడం జరిగింది.

వాస్తవానికి టేస్టీ తేజ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎవరినైతే నామినేట్ చేశారో వారందరూ కూడా ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇక తొమ్మిదో వారం తానే బయటకు రావడంతో చాలామంది ఈ ఎలిమినేషన్ పట్ల రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈయన సందీప్ మాస్టర్ ఆయన భార్య జ్యోతి రాజ్ మధ్య గొడవలు పెట్టారని స్పష్టంగా తెలుస్తోంది. సందీప్ మాస్టర్ భార్య జ్యోతితో తేజ మాట్లాడుతూ.. మాస్టర్ గారు హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా బాగా ఆడారు.. అలాగే అమ్మాయిలతో కూడా చనువుగా ఉండేవారు అంటూ చెప్పడంతో సందీప్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

- Advertisement -

దీంతో జ్యోతి కూడా అవును నేను కూడా రెండు మూడు వీడియోలు సేవ్ చేసి పెట్టుకున్నానని తెలిపింది. అంతేకాదు వంటింట్లో ఎక్కువగా ప్రియాంక కి హెల్ప్ చేస్తూ ఉండేవారు అంటూ తేజ చెప్పగా.. వెంటనే జ్యోతి అవును ఇక్కడ మనమంతా ఒకటే కదా ఇది మన ఇల్లు ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా అంటూ మాట్లాడారు. అయితే ఇంట్లో మాత్రం ఆయన నాకు ఒక హెల్ప్ కూడా చేయరు అంటూ జ్యోతి తెలియజేసింది. అంతేకాదు ఇంట్లో అమ్మాయిల అందరికీ కూడా మాస్టర్ గారు తినిపించేవారు అంటూ చెప్పడంతో సందీప్ భార్య ముందర ఒక్కసారిగా బిక్క ముఖం వేసుకున్నాడు. ఏది ఏమైనా భార్యకు హెల్ప్ చేయరు అంటూ ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలే సృష్టించారు టేస్టీ తేజ. అయితే ఇదంతా కాస్త సరదాగా జరిగినట్లు తెలుస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు