VT13: ఈ సినిమా కంచెకి పదింతలట!

వరుణ్ తేజ్ మళ్ళీ బిజీ అవుతున్నాడు. గత సంవత్సరం ఎఫ్3 తో ఆడియన్స్ ని పలకరించిన వరుణ్ తేజ్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాలేదు. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న వరుణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవ దారి అర్జున అనే సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా షూటింగ్ లోను పాల్గొంటున్నాడు.

బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయమవుతూ వరుణ్ తేజ్ తో సినిమా తీస్తున్నాడు. భారత వైమానిక దళం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా వరుణ్ కి 13వ సినిమా. ఇక లేటెస్ట్ గా ఆ సినిమా సెట్స్ లో అడుగుపెట్టాడు వరుణ్ తేజ్. అన్నపూర్ణ స్టూడియో లో వేసిన ఏడు ఎకరాల సెట్ లో ఒక ఫైట్ సీన్ చిత్రీకరణ జరుపుతున్నారు. దాంతో పాటు ఈ సినిమాలో ప్రధాన తారాగణం మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఇక తాజాగా చిత్ర యూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా భారత ఎయిర్ ఫోర్స్ లోని కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని, ఈ సినిమాలో సరికొత్త అంశాలు ఉండబోతున్నాయని తెలిసింది. అయితే వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో కంచె సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో వరుణ్ కి మంచి పేరు రావడమే గాక విమర్శల ప్రశంసలందుకుంది. ఇక ఈ సినిమా వరుణ్ తేజ్ కంచె సినిమా కి రెట్టింపు లెవెల్లో ఉంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ కెరీర్ లో మరో మెట్టు పైకి ఎదుగుతాడని అంటున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమాని సోనీ పిక్చ‌ర్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్‌, రిసైనెన్స్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు