Bhola Shankar: భగవంత్ కి “భోళా” భయం పట్టుకుందా?

Bhola Shankar Sentiment:

టాలీవుడ్ లో సెంటిమెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అది నెగిటివ్ అంశాలపై మరీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంధర్భాల్లో మేకర్స్ హిట్ సెంటిమెంట్స్ ని ఎలా నమ్ముతారో, అంతకంటే ఎక్కువగా ప్లాప్ సెంటిమెంట్లను కూడా నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక సిట్యుయేషనే భగవంత్ కేసరి చిత్ర యూనిట్ కి పట్టుకుంది. అది కూడా బాలయ్య విషయంలోనే.

అసలు విషయానికి వస్తే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ముందు నుండే మెగాఫ్యాన్స్ కి కూడా నమ్మకం లేకపోవడం వల్ల నార్మల్ ప్లాప్ కావాల్సిన సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే భోళా శంకర్ ఫెయిల్యూర్స్ కి చాలా కారణాలున్నాయి.

అందులో ఒకటిగా చిరంజీవి మాట్లాడిన నైజాం స్లాంగ్. అవును చిరంజీవి ఈ సినిమాలో మాట్లాడిన తెలంగాణ యాస ఆయనికి అస్సలు సూట్ కాలేదు. దానికి ట్రోలింగ్ కూడా చాలా జరిగింది. ఇక ఇప్పుడు రాబోతున్న భగవంత్ కేసరి విషయంలోనూ ఆ మూవీ యూనిట్ కి అదే భయం పట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్య నైజాం యాసలోనే మాట్లాడడం జరిగింది.

- Advertisement -

అయితే సింగిల్ టేక్ లో అవలీలగా డైలాగ్స్ చెప్పే బాలకృష్ణ కి తెలంగాణా యాసలో మాట్లాడడం అంతగా రాదు. ఇంతకు ముందు కూడా ఏ సినిమాలో మాట్లాడలేదు. కానీ భగవంత్ కేసరిలో అనిల్ రావిపూడి బాలయ్యతో ఈ ప్రయోగం చేయిస్తున్నాడు. అయితే ఇప్పుడు భోళా శంకర్ రిజల్ట్ తో భగవంత్ కేసరి మేకర్స్ లోనూ ఈ నైజాం యాస భయం పట్టుకుంది.

ఇప్పటికే మాస్ జోనర్ లో ఉన్న బాలయ్యను కామెడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయలేడని కొందరి అనుమానం. ఇప్పుడు ఈ తెలంగాణ యాస సమస్యతో చిత్ర యూనిట్ కి భయం పెరిగిపోతుంది. అయితే భోళా శంకర్ లో అసలు కంటెంట్ కూడా బాగాలేదు కాబట్టి సినిమా బెడిసికొట్టింది. మరి భగవంత్ కేసరి లో ఎంత దమ్ముందో సినిమా చూస్తే గాని తెలియదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు